Bigg Boss 9 Telugu Title Winner: ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) నేటితో ముగిసిపోయింది. ఆడియన్స్ ఈ సీజన్ కి క్లోజ్ అవుతున్నందుకు చాలా బాధ పడుతున్నారు. ఇంతకు ముందు ఏ సీజన్ కి కూడా ఆడియన్స్ ఇంతలా ఎమోషనల్ అవ్వలేదు. అందుకు కారణం, కంటెస్టెంట్స్ మధ్య రిలేషన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడం వల్లే. తనూజ, భరణి తండ్రి కూతురు బంధం, తనూజ , కళ్యాణ్ గురు శిష్యుల బంధం, ఇమ్మానుయేల్, సంజన అమ్మ కొడుకుల బంధం, ఇమ్మానుయేల్, కళ్యాణ్, డిమోన్ పవన్ అన్నాదమ్ముల బంధం, రీతూ చౌదరి, డెమోన్ పవన్ గిల్లికజ్జాల బంధం, ఇలా అన్ని బంధాలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో అప్పుడే ఈ సీజన్ అయిపోతుందా?, ఇక రేపటి నుండి ఈ బంధాలను చూడలేమా అనే ఫీలింగ్ ఆడియన్స్ కి చాలా బాధని కలిగిస్తోంది.
ఒక మంచి తీపి జ్ఞాపకం లాగా ఈ సీజన్ ఆడియన్స్ కి అలా గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణంగా నిల్చిన కంటెస్టెంట్స్ భరణి, సంజన, తనూజ, ఇమ్మానుయేల్. వీరిలో భరణి టాప్ 6 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అవ్వగా, సంజన టాప్ 5 కంటెస్టెంట్ గా, ఇమ్మానుయేల్ టాప్ 4 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యారు. ఇక టాప్ 3 కంటెస్టెంట్స్ గా చివరికి తనూజ, కళ్యాణ్, డిమోన్ పవన్ లు మిగిలారు. ఇక్కడి వరకు నిన్న షూటింగ్ జరిగింది. నేడు టైటిల్ విన్నింగ్ కి సంబంధించిన షూటింగ్ జరగబోతుంది. డిమోన్ పవన్ కచ్చితంగా టాప్ 3 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అవుతాడు. మరి ఆయన సూట్ కేసు తో బయటకు వస్తాడా?, లేదంటే ఉత్త చేతులతో బయటకు వస్తాడా అనేది చూడాలి. ఇక టైటిల్ విన్నింగ్ రేస్ కేవలం తనూజ, కళ్యాణ్ మధ్య మాత్రమే ఉంటుంది.
వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది బిగ్ బాస్ టీం చాలా రహస్యం గా మైంటైన్ చేస్తున్నారు. కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే హాట్ స్టార్ ఓటింగ్ లో తనూజ టాప్ 1 లో ఉందని, మిస్సెడ్ కాల్స్ ఓటింగ్ లో కూడా తనూజ భారీ మార్జిన్ తో లీడింగ్ లో ఉందని తెలుస్తోంది. నూటికి 99 శాతం తనూజ నే ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా నిలవబోతుంది. కానీ ఆ ఒక్క శాతం ఎందుకు అనుమానం అంటే, ఈ సీజన్ లో బిగ్ బాస్ టీం అప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టే. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది