https://oktelugu.com/

Junior NTR: నిన్న రాత్రి తనకి జరిగిన రోడ్డు ప్రమాదంపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్..వైరల్ గా మారిన ట్వీట్!

దేవర విషయానికి వస్తే ఈ సినిమాని కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. మొదటి భాగం షూటింగ్ మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. నిన్నటితో తనకి సంబంధించిన షూటింగ్ పూర్తి అవ్వడం తో ఎన్టీఆర్ ఒక ట్వీట్ షేర్ చేస్తూ, దేవర షూటింగ్ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేనిది.

Written By:
  • Vicky
  • , Updated On : August 14, 2024 / 04:58 PM IST
    Junior NTR

    Junior NTR

    Follow us on

    Junior NTR: సోషల్ మీడియా లో నిన్న రాత్రి నుండి జూనియర్ ఎన్టీఆర్ కి రోడ్డు ప్రమాదం జరిగింది అంటూ వచ్చిన వార్తలు అభిమానులను ఎంత కంగారుకి గురి చేసిందో మన అందరికీ తెలిసిందే. ‘దేవర’ మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకొని, ఇంటికి వెళ్తున్న సమయంలో జూబ్లీ హిల్స్ ప్రాంతం లో ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ జరిగిందని, ఆ ఘటన కారణంగా ఆయన చేతులకు దెబ్బలు తగిలిందని వార్తలు వినిపించాయి. దీనిపై ఎన్టీఆర్ టీం వెంటనే స్పందించింది. వాళ్ళు మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ చేతికి గాయమైన విషయం వాస్తవమే, కానీ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టుగా రోడ్డు ప్రమాదం వల్ల అది జరగలేదు, జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సమయం లో అదుపు తప్పడం వల్ల చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది.

    ఈ సంఘటన జరిగి 5 రోజులైంది. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ ఫ్రాక్చర్ అయిన చేతితోనే దేవర సినిమా షూటింగ్ లో పాల్గొని, సినిమాలో తన భాగంపై సంబంధించిన షూటింగ్ ని మొత్తం పూర్తి చేసాడు. మిగిలిన భాగంపై సంబంధించిన షూటింగ్ మరో వారం రోజుల్లో పూర్తి అవుతుంది. సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో పాటుగా, హ్రితిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లి ‘వార్ 2′ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ జిమ్ లో విపరీతమైన వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతున్నాడు. ఆ క్రమంలోనే ఈ ఘటన జరిగింది.

    ఇక దేవర విషయానికి వస్తే ఈ సినిమాని కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. మొదటి భాగం షూటింగ్ మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. నిన్నటితో తనకి సంబంధించిన షూటింగ్ పూర్తి అవ్వడం తో ఎన్టీఆర్ ఒక ట్వీట్ షేర్ చేస్తూ, దేవర షూటింగ్ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేనిది. సెప్టెంబర్ 27 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను,ఈ చిత్రం మీ అందరికీ సరికొత్త అనుభూతిని ఇస్తుంది’ అంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి పాట ‘ఫియర్ సాంగ్’ కి యూట్యూబ్ లో 50 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా, రీసెంట్ గా విడుదలైన ‘చుట్టమల్లే’ వీడియో సాంగ్ కి కేవలం 8 రోజుల్లోనే 60 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇంస్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన ఈ పాటకి సంబంధించిన రీల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక సినిమాకి హైప్ పెరిగేందుకు ఎలాంటి పాటలో కావాలో అలాంటి పాటలు, ఎలాంటి టీజర్ కావాలో అలాంటి టీజర్ దేవర చిత్రానికి కుదిరింది. ఇక సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ అవలీల గా కొట్టేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.