Homeఎంటర్టైన్మెంట్Junior NTR Prashanth Neel Dragon: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' లో 'బ్రూస్లీ'..ఇదేమి కనెక్షన్...

Junior NTR Prashanth Neel Dragon: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ లో ‘బ్రూస్లీ’..ఇదేమి కనెక్షన్ సామీ..ఫ్యాన్స్ పిచోళ్లు అయిపోతారు!

Junior NTR Prashanth Neel Dragon: ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్'(Dragon Movie) మూవీ గురించి సోషల్ మీడియా లో రోజురోజుకి వస్తున్నా లీక్స్ ని చూసి అభిమానులు మెంటలెక్కిపోతున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీ లోనే ఈ సినిమాలో ఉండే యాక్షన్ సీక్వెన్స్ లు ఏ సినిమాలో కూడా ఇంతకు ముందు చూసి ఉండము అట, ఆ రేంజ్ లో డిజైన్ చేయించాడట ప్రశాంత్ నీల్. […]

Junior NTR Prashanth Neel Dragon: ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్'(Dragon Movie) మూవీ గురించి సోషల్ మీడియా లో రోజురోజుకి వస్తున్నా లీక్స్ ని చూసి అభిమానులు మెంటలెక్కిపోతున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీ లోనే ఈ సినిమాలో ఉండే యాక్షన్ సీక్వెన్స్ లు ఏ సినిమాలో కూడా ఇంతకు ముందు చూసి ఉండము అట, ఆ రేంజ్ లో డిజైన్ చేయించాడట ప్రశాంత్ నీల్. ప్రస్తుతం జోర్డాన్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ తో పాటు మలయాళం స్టార్ హీరో టోనీవో థామస్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు. ఇదే ఈ చిత్రానికి సంబంధించిన చివరి ఫారిన్ షెడ్యూల్ అట. ఆ తర్వాత హైదరాబాద్ లో వేసిన సెట్స్ లోనే మిగిలిన షూటింగ్ మొత్తం చేస్తారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు బయట పడింది.

ఈ చిత్రం లోని ఒక యాక్షన్ సీక్వెన్స్ మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్లీ తో లింక్ అయ్యి ఉంటుందట. అయితే మూవీ మెయిన్ స్టోరీ కి దీనిని ఎలా కనెక్ట్ చేశారు అనేదే ఆసక్తికరమైన అంశం గా ఉంటుందని సమాచారం. అంటే AI ని ఉపయోగించి బ్రూస్లీ ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారా?, లేదా ఇది కేవలం సినిమాలోని ఒక క్యారక్టర్ కి సంబంధించిందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 23న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారట మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక టీజర్ విడుదలై, అది అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉంటే వై రేంజ్ కి అంచనాలు ఏ రేంజ్ కి వెళ్తుందో ఊహించడానికి కూడా కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు.

ఈ చిత్రం కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని చేసున్నారని టాక్. ప్రశాంత్ నీల్ తన మొదటి నుండి తల్లి సెంటిమెంట్ లేకుండా సినిమా చేయలేదు. ఈ చిత్రం లో కూడా తల్లి సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుందట. ఎన్టీఆర్ ఇందులో డ్రగ్స్ మాఫియా లీడర్ గా కనిపించనున్నాడు. పూర్తి స్థాయి నెగటివ్ క్యారక్టర్ అయ్యినప్పటికీ, తల్లి సెంటిమెంట్ ని జోడించి KGF తరహాలో సినిమా తీస్తే మాత్రం ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు ఉంటాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణీ వసంత్ నటిస్తుండగా, విలన్ గా మలయాళం హీరో టోనీవో థామస్ నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper