Junior NTR : జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) సినిమా కోసం ఎంత కష్టపడుతాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఆయన ఎంత లావుగా ఉండేవాడో అందరికీ తెలిసిందే. ఆ శరీరం తో కదలడమే కష్టమంటే, ఎన్టీఆర్ ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ డ్యాన్స్ స్టెప్పులతో అప్పటి ఆడియన్స్ ని మెంటలెక్కిపోయేలా చేసాడు. అయితే యమదొంగ నుండి ఎన్టీఆర్ తన శరీరాన్ని ఎంత నాజూగ్గా తయారు చేసుకున్నాడో మన అందరికీ తెలిసిందే. యమదొంగ లో ఉన్న ఎన్టీఆర్ కి, ఒకప్పటి ఎన్టీఆర్ కి ఏమైనా పోలిక ఉంటుందా? ఇద్దరు అన్నదమ్ములు అంటే కచ్చితంగా ఇతర భాషలకు సంబంధించిన ఆడియన్స్ నమ్మేస్తారు. యమదొంగ నుండి అదే ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ వచ్చిన ఎన్టీఆర్ మధ్యలో కాస్త బొద్దుగా తయారయ్యాడు కానీ, రీసెంట్ సమయంలో ఆయన మరింత చిక్కిపోయి కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది.
Also Read : ఎన్టీఆర్ సన్నబడటానికి అసలు కారణం ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్
‘కంత్రి’ సినిమా సమయంలో ఎన్టీఆర్ ఎంత సన్నగా కనిపించాడో, ఇప్పుడు అలా కనిపిస్తున్నాడు. కేవలం నెల రోజుల వ్యవధిలో ఆయన దాదాపుగా 18 కేజీల బరువు తగ్గాడట. ఇది సాధారణమైన విషయం కాదు. కేవలం నాలుగు నుండి 5 కిలోలు తగ్గడం కోసమే మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది ఎన్టీఆర్ నెల వ్యవధిలో ఏకంగా 18 కిలోలు తగ్గడమంటే ఆయన ఏ రేంజ్ లో వర్కౌట్స్ చేసి ఉంటాడో మీరే ఊహించండి. కేవలం వర్కౌట్స్ చేయడం మాత్రమే కాదు, ఆహరం విషయం లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడట. కేవలం లిక్విడ్ ఫుడ్ ని మాత్రమే సేవిస్తూ, ద్రవపదార్థాల జోలికి పోకుండా ఎన్టీఆర్ ఇలా మ్యానేజ్ చేసాడట. ఇదంతా ఆయన ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో చేయబోతున్న సినిమా గురించే. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ ఎన్టీఆర్ లేకుండానే పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ నిన్నటి నుండి మొదలైంది.
ఎన్టీఆర్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. నాకు నువ్వు ఈ సినిమాలో చాలా సన్నగా కనపడాలి అని చెప్పిన వెంటనే ఎన్టీఆర్ వర్కౌట్స్ ప్రారంభించి ఇలా తయారయ్యాడు. కొన్ని రోజుల క్రితమే ఆయన ‘వార్ 2’ మూవీ షూటింగ్ లో పూర్తి చేసాడు. ఈ సినిమా షూటింగ్ జరిగినంత కాలం ఎన్టీఆర్ కాస్త బొద్దుగానే కనిపించాడు. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా సగానికి పైగా తగ్గిపోయి కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వాసంత్ నటిస్తుంది. అదే విధంగా మలయాళం స్టార్ హీరోలలో ఒకరైన తొనివో థామస్ ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించనున్నాడు. కేవలం వీళ్ళు మాత్రమే కాదు, పాన్
Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ ఈవెంట్ లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి..? దాని ధర ఎంతో తెలుసా!