Junior NTR Devara: రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న తరువాత, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. అందుకే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా మన యంగ్ టైగర్ తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ కారణంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దేవర” సినిమాపై ఈ స్టార్ హీరో భారీ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
తుఫాను మధ్య సముద్ర ఉపరితలంపై జరిగే ఆడ్రినలిన్-రషింగ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సముద్ర-సెటప్‌లో చిత్రీకరిస్తున్నారు ఈ సినిమా యూనిట్. ఈ క్రమంలో అనేక విన్యాసాలు అలాగే విజువల్ ఎఫెక్ట్‌లు ఆ సీన్ లో పెడుతూ ఉన్నారట. అయితే ఈ మొత్తం యాక్షన్ బ్లాక్‌ను చాలా జాగ్రత్తగా వహించి చేయాలి అని జూనియర్ ఎన్టీఆర్ సినిమా టీం కి కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సీన్స్ కోసం మన యంగ్ టైగర్ ఎంతగానో ఇన్వాల్వ్ అయి చేస్తున్నారట.
హాలీవుడ్ టీమ్ కంపోజ్ చేస్తున్న స్టంట్స్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ బ్లాక్ లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా రావడానికి, జూనియర్ ఎన్టీఆర్ పక్కనుంది మరి గ్రాఫిక్స్ టీం తో సమయం స్పెండ్ చేస్తున్నారని తెలుస్తోంది. మేకింగ్‌కు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మన హీరో పాల్గొంటున్నారని వినికిడి. అలాగే, ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆదిపురుష్ VFX ఆర్భాటం వంటి అవాంతరాలు ఈ సినిమాకి రాకుండా ఉండడానికి ఈ విషయంపై మన తారక్ ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారట.
అంతేకాదు అస్సలు ఫ్లాప్ లేని దర్శకుడు కొరటాల శివాకి ఈ దేవరా చిత్రానికి ముందర ఆచార్యలాంటి డిజాస్టర్ వచ్చింది. అలానే రాజమౌళి సినిమా చేసిన తరువాత ఏ హీరో కైనా ఫ్లాప్ వచ్చి తీరటం ఖాయం అనే సెంటిమెంట్ కూడా తెలుగువారికి ఉంది. అయితే అలాంటి వేమి జరగకుండా ఉండడానికి ఈ చిత్రం గురించి జూనియర్ ఎన్టీఆర్ మరీ ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నారని వినికిడి.