Hanuman – NTR : హనుమాన్ సినిమాకు ఎన్టీఆర్ తోడు.. సినిమా పక్కా హిట్టే..?

ఎందుకంటే ఈ గ్లింప్స్ ను చూడడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్తారు. దీని వల్ల హనుమాన్ సినిమా కూడా ప్లస్ పాయింట్ అవడం పక్కా అని టాక్.

Written By: NARESH, Updated On : January 8, 2024 3:48 pm
Follow us on

Hanuman – NTR : సంక్రాంతికి వచ్చే సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. కానీ చిన్న సినిమాలు ఈ పండుగ సందర్భంగా పెద్ద సినిమాలను తట్టుకోవడం కష్టమే. అయితే ఈ సారి సంక్రాంతికి సజ్జ హీరోగా హనుమాన్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా వివిధ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. కానీ ఈ సినిమాపై టాలీవుడ్ లో కుట్రలు జరుగుతున్నాయని మేకర్స్ ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఈ సినిమాకు బడా హీరోలు సపోర్ట్ చేయడంతో మరింత హైప్ వచ్చేసింది.

జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది హనుమాన్ సినిమా. డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ తేజ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక థియేటర్ల వివాదం వల్ల ఈ సినిమాకు మరింత హైప్ వచ్చేసింది. ఏది ఏమైనా స్టార్ హీరోలు ఈ సినిమాకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక మెగాస్టార్ చిరు ఏకంగా ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

రవితేజ, చిరు మాత్రమే కాదు ఇప్పుడు జూ. ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకు తోడవుతున్నారు అని టాక్. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా గ్లింప్స్ జనవరి 8న విడుదల కాబోతున్నాయి. ఈ గ్లింప్స్ ను జనవరి 12న విడుదలవుతున్న హనుమాన్ థియేటర్లలో ప్రదర్శించాలని దేవర మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజం అయితే సినిమా సంచలన విజయం సాధించడం పక్కా అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఈ గ్లింప్స్ ను చూడడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్తారు. దీని వల్ల హనుమాన్ సినిమా కూడా ప్లస్ పాయింట్ అవడం పక్కా అని టాక్.