https://oktelugu.com/

Junior NTR : ‘వార్ 2’ లో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్..? ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరే ట్విస్టులు ఇవ్వబోతున్న మేకర్స్!

ఈ ఏడాది 'దేవర' చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా 370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన జూనియర్ ఎన్టీఆర్, తన తదుపరి చిత్రంగా హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2' లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 31, 2024 / 09:32 AM IST

    Junior NTR

    Follow us on

    Junior NTR : ఈ ఏడాది ‘దేవర’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా 370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన జూనియర్ ఎన్టీఆర్, తన తదుపరి చిత్రంగా హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రం లో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎట్టిపరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ విలన్ రోల్ లో కనిపిస్తున్నదని చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇప్పటి వరకు రాలేదు.

    లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పూర్తి స్థాయి విలన్ రోల్ లో కనిపించడం లేదు. ఫ్లాష్ బ్యాక్ లో ఈయన దేశం కోసం ప్రాణాలను సైతం ఇచ్చే సైనికుడి పాత్రలో కనిపిస్తాడట. తన దేశానికీ హాని చేయడం కాదు, ఆ ఆలోచన వచ్చినా కూడా శత్రువులను చీల్చి చెండాడే పవర్ ఫుల్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అలాంటి దేశభక్తి ఉన్నటువంటి ఎన్టీఆర్, అకస్మాత్తుగా ఎందుకు దేశానికీ విరోధిలాగా మారాడు?, దాని వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఏమిటి అనేది డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చాలా అద్భుతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ఎన్టీఆర్ ని ఇందులో ఈ డ్యూయల్ షేడ్స్ లో అభిమానులు, ప్రేక్షకులు చూడొచ్చు. అంతే కాకుండా ఈ చిత్రంలో ఆయన డ్యూయల్ రోల్ (డబుల్ యాక్షన్) ద్వారా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

    ఇందులో ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ మధ్య వచ్చే సన్నివేశాలు నువ్వా, నేనా అనే రేంజ్ లో ఉండబోతున్నాయట. వీళ్ళ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పించే విధంగా ఉంటాయట. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారట. ఈ చిత్రం లో ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ లతో పాటు షారుఖ్ ఖాన్ కూడా ఒక కీలక సన్నివేశం లో ‘పఠాన్’ గా కనిపించబోతున్నాడని టాక్ ఉంది. ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి. ఇకపోతే ఎన్టీఆర్ ఈ చిత్రం తర్వాత ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోయే సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా, అదే విధంగా ‘దేవర 2 ‘ చిత్రాలను చేయబోతున్నాడు.