America: సహజంగా ఏదైనా విషయాన్ని అత్యంత లోతుగా పరిశీలించే అమెరికా దర్యాప్తు బృందాలు.. గాలి బుడగల విషయంలో ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించాయో ఇప్పటికీ అందు పట్టదు. అయితే చైనా మాత్రం గాలి బుడగలతో అమెరికా అధికారుల దృష్టిని మళ్ళించింది. తన పని తాను చేసుకుంటూ పోయింది. ఈసారి ఏకంగా అమెరికా ట్రెజరీ శాఖ పై సైబర్ దాడి చేసింది. డిసెంబర్ మొదటి వారంలో అమెరికా ట్రెజరీ శాఖకు సంబంధించిన వర్క్ స్టేషన్లను, కొన్ని డాక్యుమెంట్లను చైనా సైబర్ నేరగాళ్లు యాక్సెస్ చేశారు. దానివల్ల అమెరికా సమాచారాన్ని మొత్తం వారు తస్కరించారు. సమాచారం వరకే ఆగారా? లేక ఇంకా ఏమైనా డబ్బులు కూడా తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారా? ఇంకా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడ్డారా? అనే ప్రశ్నలకు అమెరికా అధికారులు సమాధానం చెప్పలేదు..” చైనా నుంచి సైబర్ నేరగాళ్లు మా వర్క్ స్టేషన్ల మీద పడ్డారు. పదేపదే దాడులు చేశారు. డాక్యుమెంట్లను యాక్సెస్ చేశారు. ఇది మాకు ఇబ్బందికరంగా మారింది. మా సైబర్ భద్రతా నిపుణులను సంప్రదించాం. పరిస్థితిని చక్కదిద్దాం. సైబర్ నేరగాళ్లకు యాక్సెస్ అందకుండా చేయగలిగాం. సైబర్ నేరగాళ్లు వదిలిన ఆధారాల ప్రకారం.. డ్రాగన్ ప్రభుత్వం మద్దతు పలికే సైబర్ హ్యాకింగ్ బృందమే ఈ పని చేసినట్టు తెలుస్తోందని” అమెరికా నిపుణులు పేర్కొన్నారు.
చైనా చేస్తోంది అదే
హ్యాకింగ్ గురించి అమెరికా కొత్తగా చెప్పింది కానీ.. చాలా సంవత్సరాల నుంచి చైనా అదే చేస్తోంది. పాఠశాల విద్యలో, కళాశాల చదువుల్లో హ్యాకింగ్ ను ఒక సబ్జెక్టుగా మార్చింది. అక్కడ ఏకంగా విశ్వవిద్యాలయాలలో ఈ కోర్స్ గురించి విద్యార్థులకు ప్రత్యేకంగా చెబుతోంది. భవిష్యత్తు కాలం మొత్తం సైబర్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి.. ముందు జాగ్రత్తగానే ఇలాంటి విధానానికి చైనా శ్రీకారం చుట్టింది. దీనివల్ల ప్రత్యర్థి దేశాల మీద సైబర్ దాడులు చేయిస్తూ.. కీలక సమాచారాన్ని తస్కరించి.. తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది చైనా ప్లాన్. ఇప్పటికే దీనిని అమల్లో పెట్టింది కూడా.. ఆ మధ్య భారత్, జపాన్, వంటి దేశాలపై సైబర్ అటాక్స్ చేయించింది. అయితే ఆదేశాల సైబర్ భద్రత పటిష్టంగా ఉండటంవల్ల చైనా ఆటలు సాగలేదు. మరి టెక్నాలజీకి సరికొత్త పాఠాలు చెప్పే అమెరికా చైనా విషయంలో ఎందుకు అలర్ట్ కాలేక పోయింది? సైబర్ నేరగాళ్లు కీలకమైన ట్రెజరీ శాఖను యాక్సెస్ చేస్తుంటే ఎందుకు చూస్తూ ఉండిపోయింది? ఈ ప్రశ్నలకు చైనా వద్ద బలమైన సమాధానం ఉంది. కానీ అమెరికా వద్దనే లేదు.