Homeఆంధ్రప్రదేశ్‌Junior NTR-Allu Arjun : ఇద్దరూ ఇద్దరే... ఒకే క్లబ్ లోకి జూనియర్ ఎన్టీఆర్, అల్లు...

Junior NTR-Allu Arjun : ఇద్దరూ ఇద్దరే… ఒకే క్లబ్ లోకి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్!

Junior NTR-Allu Arjun :  ఏపీ( Andhra Pradesh) రాజకీయాలతో పాటు సినీ రంగాల్లో నందమూరి, కొణిదల కుటుంబాలకు ప్రత్యేక స్థానం ఉంది. నందమూరి తారక రామారావు వెండితెరను ఏలారు. అటు తరువాత మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా నిలిచారు. రాజకీయాల్లోకి వచ్చిన నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రాగలిగారు. మెగాస్టార్ చిరంజీవి పార్టీ ఏర్పాటు చేసి సక్సెస్ కాలేకపోయారు. అయితే సోదరుడి పార్టీ నుంచి గుణపాఠాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రాణిస్తున్నారు. అయితే ఈ రెండు కుటుంబాలకు చెందిన యువ హీరోలు సినీ రంగంలో రాణిస్తున్నారు. కానీ ఓ ఇద్దరు మాత్రం తమ సొంత అజెండాతో ముందుకు సాగుతున్నారు.

* మూడోతరం హీరోగా
నందమూరి కుటుంబంలో మూడో తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్( Junior NTR) రాణిస్తున్నారు. ఆయనతో పాటు సోదరుడు కళ్యాణ్ రామ్ సినిమాల్లో మెరుస్తున్నారు. మరో వారసుడు తారకరత్న అకాల మరణం చెందారు. అయితే గత కొంతకాలంగా తన సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు తారక్, కళ్యాణ్ రామ్ సోదరులు. నందమూరి అభిమానుల్లో తమ ఫ్యాన్స్ వేరన్న రీతిలో భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. నందమూరి కుటుంబ కార్యక్రమాల్లో సైతం పెద్దగా పాల్గొనడం లేదు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల కోసం భారీ సమావేశానికి ప్లాన్ చేస్తున్నారు.

* వేరు చేసి చూడలేం
మెగా, అల్లు కుటుంబాలను వేరుచేసి చూడలేం. ఎందుకంటే మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చారు అల్లు అర్జున్( Allu Arjun). చిరంజీవి వేసిన పునాదితోనే తాము ఎదిగామని అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ ఇటీవల తన సొంత అజెండాతో ముందుకెళ్తున్నారు. మెగా అభిమానులు వేరు, అల్లు ఫాన్స్ వేరు అన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. క్రమేపి మెగా కుటుంబానికి దూరం జరుగుతున్నారు. రాజకీయంగా కూడా భిన్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేనకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీకి మద్దతు తెలిపారు. ఒక విధంగా చెప్పాలంటే మెగా కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డారు అల్లు అర్జున్. అదే సమయంలో మెగా కుటుంబం కూడా పట్టించుకోవడం లేదు.

* ఇద్దరిదీ అదే పరిస్థితి
జూనియర్ ఎన్టీఆర్ తో పాటు అల్లు అర్జున్ ఒక క్లబ్ లోకి చేరినట్టు అయ్యింది. తారక్ కు నందమూరి కుటుంబం( Nandamuri family) ఆదరణ లేదు. అయితే ఆయనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అల్లు అర్జున్ పరిస్థితి కూడా అంతే. తనకంటూ ఒక స్టార్ డం ఏర్పడింది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరికీ ఎటువంటి లోటు లేదు. ఇద్దరూ ఇద్దరే. తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోగలరు. సినీ రంగంలో రాణించగలరు. అదే సమయంలో రాజకీయాలు అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version