Bulli Raju : ఒక్కోసారి హద్దులే దాటిన ఫేమ్ కూడా సదరు సెలబ్రిటీస్ కి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళ ప్రమేయం లేకుండానే అనేక సమస్యల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vastunnam)’ ఫేమ్ బుల్లి రాజు(Bulliraju|) పరిస్థితి కూడా అలాగే తయారైంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకడు ఈ బుల్లి రాజు. ఈ బుడ్డోడి అసలు పేరు రేవంత్(revanth). 2024 సార్వత్రిక ఎన్నికలలో, ఎంతో హుషారుగా జనసేన పార్టీ కి ప్రచారం చేస్తూ కనిపించిన ఒక వీడియో ని చూసి, అనీల్ రావిపూడి(Anil Ravipudi) ఇతన్ని పిలిపించి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో చేయించాడు. ఈ సినిమాలో బుల్లిరాజు క్యారక్టర్ సెన్సేషన్ అవ్వడంతో బుడ్డోడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్లినా ఈ బుడ్డోడితో సెల్ఫీలు దిగడానికి ప్రేక్షకులు ఎగబడిపోతున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఈమధ్య ఈ బుడ్డోడి క్యారక్టర్ పేరుని తెగ వాడేస్తున్నారు.
ఇవి గమనించిన రేవంత్ తండ్రి శ్రీనివాసరావు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్య కాలంలో మా అబ్బాయి పేరు మీద కొన్ని పేజీలు క్రియేట్ చేసి, అనవసరమైన సెటైర్లు వేస్తున్నారు. చాలా మంది అవి మా అబ్బాయే వేసినట్టుగా అనుకుంటున్నారు. మా అబ్బాయి రేవంత్ కి కేవలం ఇంస్టాగ్రామ్ లో తప్ప వేరే ఏ ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో అకౌంట్స్ లేవు. ఏదైనా ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి వచ్చినవి మాత్రమే నమ్మండి. మా అబ్బాయి పేరుతో వేసిన అసభ్య ట్వీట్స్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాము. దయచేసి మా అబ్బాయికి ఎలాంటి రాజకీయ రంగులు పులమొద్దు. మేము ఏ పార్టీకి చెందినవాళ్ళం కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన వేసిన ఈ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఇది ఇలా ఉండగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తర్వాత ఈ బుడ్డోడికి సినిమా అవకాశాలు మామూలు రేంజ్ లో రావడం లేదు. ప్రొమోషన్స్ కి కూడా ఇతన్ని తెగ వాడేస్తున్నారు. రీసెంట్ గానే ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్ తన కొత్త సినిమా ‘లైలా’ మూవీ ప్రొమోషన్స్ కోసం వాడేసాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతుంది. ఓవర్ నైట్ క్రేజ్ కారణంగా ఎన్నో లాభాలు ఉంటాయి, అదే విధంగా కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఆ నష్టాల నుండి తమ కొడుకుని కాపుడుకోవడానికి అతని తల్లిదండ్రులు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇకపోతే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం జీ తెలుగు లో టెలికాస్ట్ కి కూడా సిద్ధమైంది. అందుకు సంబంధించిన ప్రొమోషన్స్ కూడా మొదలయ్యాయి.