Trivikram: త్రివిక్రమ్.. వెండితెరపై మాటల తూటాలు పేల్చిన మాటల మాంత్రికుడు, జీవిత సత్యాలను చిన్న పలుకులోనే పలికించగల నేర్పరి త్రివిక్రమ్. కానీ.. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు విధించిన జరిమాన నుంచి మాత్రం త్రివిక్రమ్ తప్పించుకోలేకపోయాడు. విషయంలో వెళ్తే.. హైదరాబాద్ సిటీలోని జూబ్లిహిల్స్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు.

అయితే, అదే సమయంలో అటుగా వెళ్తున్న త్రివిక్రమ్ కారును పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకుని కారును తనిఖీ చేయగా కారులో బ్లాక్ ఫిలింను గుర్తించారు. అనంతరం కారుకు ఫైన్ వేసి బ్లాక్ ఫిలింను తొలగించారు పోలీసులు. మొత్తానికి త్రివిక్రమ్ పోలీసులకు రూ. 700 జరిమానా కట్టారు. త్రివిక్రమ్ జరినామా కడుతూ ఉండగా.. ఆ ఫోటోను ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది.
ఏది ఏమైనా సున్నితమైన హాస్యంతో నవ్వించాలన్నా, అనుబంధాల గురించి గుండె బరువెక్కేలా భావాన్ని పలికించాలన్నా త్రివిక్రమ్ కి వెన్నతో పెట్టిన విద్య. కేవలం తన మాటలతోనే మంత్రం చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనేది త్రివిక్రమ్ కి పెన్నుతో పెట్టిన విద్య. కానీ.. అలాంటి త్రివిక్రమ్ కూడా ఇలా నిబంధనలకు విరుద్ధంగా వెళ్లి ఫైన్ కట్టడం బాధాకరమైన విషయం.
Also Read: నీ ఓవరాక్షన్ ఆపు.. నీ వ్యవహారం మాకు తెలుసు
ఒక్కటి మాత్రం నిజం. నేటి రచయితలందు త్రివిక్రమ్ వేరయా అనేది. త్రివిక్రమ్ సినిమా చూస్తున్నంత సేపు త్రివిక్రమ్ ఆలోచనలే ప్రేక్షకుడి మదిలో కదలాడుతూ ఉంటాయి. అంత గొప్పగా లాజిక్ ను పట్టుకుని త్రివిక్రమ్ సినిమాలు చేస్తాడు. మరి తన కారులో బ్లాక్ ఫిలిం ఉంటే.. పోలీసులు పట్టుకుంటారు అనే చిన్న లాజిక్ ను త్రివిక్రమ్ ఎలా మిస్ అయ్యాడు ?
అసలు వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ తమ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ట్రాఫిక్ పోలీసులు నిత్యం మొత్తుకుంటున్నారు. పైగా ఇటీవల సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని చాలా బలంగా చెప్పింది. అయినా సినీ ప్రముఖులు మాత్రం తమ కారుకు ఉన్న బ్లాక్ ఫిలింను మాత్రం తీయడం లేదు. రీసెంట్ గా అల్లు అర్జున్, మంచు మనోజ్‌లకు కూడా ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసి బ్లాక్ ఫిలిం తొలగించారు.
Also Read: అనసూయ మోజులో స్టార్ డైరెక్టర్.. చివరకు చిరంజీవి విషయంలో కూడా