Bigg Boss Telugu OTT: తెలుగునాట బిగ్ బాస్ ఓటీటీషోకి విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. ప్రారంభమైన మొదటి రోజు నుంచే విభిన్నమైన టాస్క్ లతో దూసుకుపోతోంది. గతంలో టెలివిజన్ లో వచ్చిన సీజన్ల కంటే.. నాన్ స్టాప్ సీజన్ మరింత రంజుగా సాగుతోంది. నిత్యం కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు పెడుతూనే ఉన్నాడు.

ఇక లవ్ ట్రాక్ లు, రొమాన్స్ లు, గొడవలు, బూతు పురాణాలకు ఏమాత్రం కొదవ లేకుండా చూస్తున్నారు కంటెస్టెంట్స్. ఈసారి బోల్డ్ బ్యూటీ లు ఎక్కువగా ఉండడంతో నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. అందరూ ఆశించినట్లుగానే బోల్డ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా పండుతుంది. కాగా ఇప్పటికే 5 వారాలు పూర్తి చేసుకుంది ఈ నాన్ స్టాప్ సీజన్. 17 మంది కంటెస్టెంట్స్ లో గడిచిన ఐదు వారాల్లో ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, సరయు, ఆర్జే చైతు, తేజస్విలు హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయారు.
Also Read: ‘ప్రభాస్’ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. డైరెక్షన్ కి మారుతి రెడీ !
అయితే ఎవరూ ఊహించని విధంగా ముమైత్ ఖాన్ రీఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఆదివారం ఎపిసోడ్ ఎప్పుడు సందడిగానే సాగుతుంది. ఆ రోజు ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ ఉన్నప్పటికీ.. అది మర్చి పోయే విధంగా నాగ్ వారితో ఆటలు ఆడిస్తూ ఉంటాడు. ఇక నిన్నటి ఆదివారం ఎలిమినేషన్ టాస్క్ మరిచిపోయే విధంగా అఖిల్, బిందుమాధవి మధ్య విడాకుల సీన్ ను తీసుకువచ్చారు. ఇదంతా కోర్టు సీను కాబట్టి ఇందులో ముమైత్ ఖాన్ జడ్జిగా వ్యవహరించింది.
కాగా ఆమె తన ఫ్రెండ్ అయిన అఖిల్ వైపు తీర్పు ఇచ్చింది. దీంతో అందరూ ఆమె మీద విమర్శలు కురిపించినా.. నాగ్ మాత్రం ఆమెను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ముమైత్ ఖాన్ నేషనల్ రికార్డు కొట్టింది అంటూ సంచలన ప్రకటన చేశాడు. బిగ్ బాస్ సీజన్ వన్ లో ఆమె డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం ఓ సారి బయటకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత అదే సీజన్ లో ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు నాన్ స్టాప్ సీజన్ లో కూడా ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ హౌస్ లోకి వచ్చింది. ఇప్పటివరకు బిగ్ బాస్ లో ఎవరూ కూడా ఇన్నిసార్లు బయటకు వెళ్లి రాలేదని.. ఇది ఒక నేషనల్ రికార్డ్ అంటూ నాగ్ వెల్లడించాడు.
Also Read: షాకింగ్.. ఇది తెలుగు వాడి సింహ గర్జన !