https://oktelugu.com/

NTR Devara Movie: దేవర వాయిదా అధికారికమే… న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

దేవర టీమ్ అధికారికంగా ప్రకటించకుండానే... ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దాదాపు దేవర పోస్ట్ ఫోన్ అవుతుందని అందరూ భావించారు. ఊహించినట్లే దేవర వెనక్కి వెళ్ళింది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 16, 2024 / 05:33 PM IST
    Follow us on

    NTR Devara Movie:ఎన్టీఆర్ 30వ చిత్రం దేవర విడుదల అధికారికమే. నేడు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. సమ్మర్ నుండి దసరాకు షిఫ్ట్ అయ్యింది. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వస్తున్న రెండో చిత్రం దేవర. గతంలో వీరిద్దరూ జనతా గ్యారేజ్ మూవీ కోసం పని చేశారు. జనతా గ్యారేజ్ మంచి విజయం సాధించింది. దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఇటీవల దేవర వాయిదా అంటూ కథనాలు వెలువడ్డాయి. దేవర చెప్పిన డేట్ కి రాకుంటే ఫ్యామిలీ స్టార్ విడుదల చేస్తామని దిల్ రాజు అన్నారు.

    దేవర టీమ్ అధికారికంగా ప్రకటించకుండానే… ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దాదాపు దేవర పోస్ట్ ఫోన్ అవుతుందని అందరూ భావించారు. ఊహించినట్లే దేవర వెనక్కి వెళ్ళింది. ఏకంగా ఆరు నెలలు వాయిదా వేశారు. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. న్యూ రిలీజ్ డేట్ తెలియజేస్తూ పోస్టర్ వదిలారు.

    దేవర రిలీజ్ డేట్ పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. ఇప్పటి వరకు దేవర నుండి ఎన్టీఆర్ ని ఒక షేడ్ లో చూపించారు. నేడు విడుదల చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉంది. దేవర లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే వాదన ఉంది. దాన్ని కొత్త పోస్టర్ బలపరుస్తుంది. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగంగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. జాన్వీ కపూర్ నటించిన మొదటి సౌత్ ఇండియా మూవీ దేవర. కథలో ఆమె పాత్ర కీలకం అంటున్నారు. ఇక విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ని దించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో దేవర నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ అనంతరం ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడంతో సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ చిత్రాల్లో నటించనున్నాడు.