
NTR 30 Making Video: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన #NTR30 రెగ్యులర్ షూటింగ్ నిన్న రాత్రి నుండి హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. నగర శివార్లలో ఉన్న ఒక ప్యాలెస్ లో ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించినట్టు సమాచారం.జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొన్నాడు.ప్యాలెస్ లో షూటింగ్ అనగానే ఇదేమైనా రాజుల కాలం కథ నా? అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
అసలు కొరటాల శివ ఏమి ప్లాన్ చేసాడు, సంవత్సరం పాటు సమయం తీసుకొని ఈసారి కొడితే పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాలి అనే కసితోనే ఈ చిత్ర కథని సిద్ధం చేసినట్టు ఉన్నాడు అని అనుకుంటున్నారు. ఆచార్య సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని కెరీర్ లో మొట్టమొదటి సారి చూసిన కొరటాల శివ, ఈ సినిమా కథని ఫైర్ తో రాసాడని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అప్లోడ్ చేసాడు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ ని షూటింగ్ స్పాట్ లో చూసేలోపు ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఈ సినిమా మీద ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మామూలివి కాదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ నుండి సోలో మూవీ విడుదల అయ్యి 5 ఏళ్ళు అవుతుంది.మధ్యలో #RRR ఉన్నప్పటికీ కూడా అభిమానులు ఎన్టీఆర్ పాత్ర పట్ల పూర్తి స్థాయి సంతృప్తి లో లేరు.

దీనితో ఈ సినిమా పైనే వాళ్ళు ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ ఏడాది లో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్ 9 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల చేయబోతున్నారట.ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు, శ్రీకాంత్ మరియు ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Great to be on sets again with Koratala Siva ! pic.twitter.com/uKNFNtKyZO
— Jr NTR (@tarak9999) April 1, 2023