https://oktelugu.com/

Jr. NTR : తనపై ఆరోపణలు చేసినా కూడా ఆర్ధిక సాయం అందించిన జూనియర్ ఎన్టీఆర్..ఇంత మంచి మనసు ఎవరికీ ఉంటుంది!

మూడు నెలల క్రితం జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ చావు బ్రతుకుల మధ్యలో ఉంటూ, తనకి దేవర చిత్రం చూడాలనే చివరి కోరిక ఉందని ఒక వీడియో రికార్డు చేయగా, దానిని సోషల్ మీడియా లో ఎన్టీఆర్ అభిమానులు షేర్ చేసి ఎంత వైరల్ చేసారో మన అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 25, 2024 / 02:07 PM IST

    Jr. NTR

    Follow us on

    Jr. NTR : మూడు నెలల క్రితం జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ చావు బ్రతుకుల మధ్యలో ఉంటూ, తనకి దేవర చిత్రం చూడాలనే చివరి కోరిక ఉందని ఒక వీడియో రికార్డు చేయగా, దానిని సోషల్ మీడియా లో ఎన్టీఆర్ అభిమానులు షేర్ చేసి ఎంత వైరల్ చేసారో మన అందరికీ తెలిసిందే. ఈ వీడియో జూనియర్ ఎన్టీఆర్ వరకు చేరడం తో ఆయన వెంటనే స్పందించి కౌశిక్ తో, అతని తల్లితో వీడియో కాల్ లో మాట్లాడాడు. వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్పడమే కాకుండా, కౌశిక్ కోలుకోవడానికి అవసరమైన వైద్య చికిత్స కి ఆర్ధిక సాయం చెయ్యండి అంటూ తన మ్యానేజర్స్ కి, అకౌంటెంట్స్ కి చెప్పాడు ఎన్టీఆర్. అయితే ఈ విషయం బాగా వైరల్ అవ్వడంతో వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి కౌశిక్ కి 12 లక్షల రూపాయిల సాయం అందించింది. అదే విధంగా టీటీడీ బోర్డు తమ ట్రస్టు నుండి 40 లక్షల రూపాయిలు కౌశిక్ మెడికల్ బిల్స్ కి కట్టింది.

    అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా తమ వంతు సహాయంగా రెండు లక్షల 50 వేల రూపాయిల విరాళం అందించారు. ఇక ఆ తర్వాత కౌశిక్ కి మెరుగైన వైద్యం అందించి అతని ప్రాణాలను కాపాడారు డాక్టర్లు. కానీ డీఛార్జి చేయడానికి 20 లక్షల రూపాయిలు అడిగారట హాస్పిటల్ యాజమాన్యం. ఇప్పుడు అంత డబ్బు తాను ఎక్కడి నుండి తీసుకొని రావాలో అర్థం కాక, కౌశిక్ తల్లి ఎన్టీఆర్ అకౌంటెంట్ కి మ్యానేజర్ కి ఫోన్ కాల్ చేసి, డిశ్చార్జ్ చెయ్యడానికి డాక్టర్లు 20 లక్షలు అడుగుతున్నారు. మీరు ఆర్ధిక సాయం చేస్తానని చెప్పారు కదా, దయచేసి మాకు సహాయం చేయండి అని అడిగిందట. కానీ వాళ్ళు మీరు ప్రభుత్వాన్ని సంప్రదించండి, మేము ఇవ్వలేము అని చాలా గట్టిగా చెప్పారట.

    దీంతో ఏమి చెయ్యాలో తెలియని కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ‘జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పాడు. తమకి ఆర్ధికసాయం అందిస్తానని చెప్పి, ఇప్పటి వరకు ఆయన ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు’ అంటూ రచ్చ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి ఎన్టీఆర్ వరకు విషయం చేరడంతో ఆయన వెంటనే హాస్పిటల్ కి తన మ్యానేజర్ చేత 12 లక్షల రూపాయిలు హాస్పిటల్ కి కట్టించి, కౌశిక్ ని డిశ్చార్జ్ అయ్యేలా చేసాడు. దీంతో పెద్ద సమస్యగా మారుతుంది అనుకున్న ఈ ఘటన, ఇక్కడితో ముగించుకుంది. ఎన్టీఆర్ వెంటనే స్పందించి సహాయం చేయడం పై ఆయన అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ వరకు ఈ విషయం ముందే వెళ్లుంటే ఇంత దూరం వచ్చేది కాదు, ఎప్పుడో సహాయం అందించేవాడు అని ఆయన అభిమానులు అంటున్నారు.