AUS Vs NZ: మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఆలౌట్.. కివీస్ ఆధిపత్యం ఎంతంటే..

న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ 7 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అతడి పదునైన బంతులు ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

Written By: Suresh, Updated On : March 9, 2024 10:42 am

AUS Vs NZ

Follow us on

AUS Vs NZ: మూడు టి20 లు, ఒక టెస్ట్ కోల్పోయిన తర్వాత, రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకు ఆల్ అవుట్ అయిన తర్వాత.. తొలిసారిగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శించింది. శనివారం రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా జట్టును 256 పరుగులకు ఆల్ అవుట్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది.. కడపటి వార్తలు అందే సమయానికి ఆస్ట్రేలియాపై 18 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని నమోదు చేసింది.. ప్రస్తుతం క్రీజ్ లో లాతం (53), రచిన్ రవీంద్ర (1) ఉన్నారు. ఓపెనర్ యంగ్ (1) ఎప్పటి లాగానే నిరాశపరచాడు. ఈ టెస్ట్ సిరీస్ లో వరుసగా విఫలమౌతూ వస్తున్న విలియంసన్ రెండవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు రెండో వికెట్ కు వందకు మించిన పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఓపెనర్ లాతం, విలియంసన్ కలిసి రెండో వికెట్ కు 105 పరుగులను జోడించడంతో న్యూజిలాండ్ జట్టు గౌరవప్రదమైన స్థితిలో నిలిచింది. భారీ స్కోరు దిశగా జట్టును ఈ జంట నడిపిస్తుందనుకుంటున్న తరుణంలో విలియంసన్ (51) వద్ద కమిన్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

అంతకుముందు మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 256పరుగులకు ఆల్ అవుట్ అయింది. లబూ షేన్(90) ఆస్ట్రేలియా జట్టును ఆదుకున్నాడు. కీలకమైన ఆటగాళ్లు స్వల్ప స్కోర్ కే వెనుతిరగడంతో అతడు ఒక్కడే మొండిగా నిలబడ్డాడు. న్యూజిలాండ్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు.. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు సౌతి బౌలింగ్ లో ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అతడు ఔటయ్యాడు. లేకుంటే ఆస్ట్రేలియా స్కోర్ మరింత పెరిగేది. చివరి బ్యాటర్లు కూడా వెంట వెంటనే అవుట్ కావడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 256 పరుగుల వద్ద ముగిసింది.. ఫలితంగా 94 పరుగుల ఆధిక్యం లభించింది.

న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ 7 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అతడి పదునైన బంతులు ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మొన్నటి మూడు టి20 లు, ఇటీవలి తొలి టెస్ట్ వరకు న్యూజిలాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు.. రెండవ టెస్టులో మాత్రం ఆ స్థాయి దూకుడు చూపించలేకపోయారు. ఒక్క లబూ షేన్ మినహా మిగతా వారంతా స్వల్ప స్కోర్ కే వెనుతిరి గారు..