https://oktelugu.com/

RRR – NTR : త్రిబుల్ ఆర్ పులి సీన్ షూట్ లో కెమెరాకు దొరకని తారక్..సంచలన విషయాలు లీక్…

ఇక నేను పులి తో పరిగెత్తేటప్పుడు నాకు ఎప్పటికప్పుడు ఇన్ పుట్స్ ఇస్తుండేవాడు. ఒక పులి మనిషి కంటే నాలుగు రెట్లు వేగంగా ముందుకు దుంకుతుంది. అలాంటి పులితో పరిగెత్తినప్పుడు నువ్వు ఎంత వేగంగా పరిగెత్తలో నువ్వే ఆలోచించుకో అని నాకు చెప్పాడు.

Written By:
  • NARESH
  • , Updated On : April 20, 2024 / 08:58 PM IST

    Jr. NTR was not found on camera in RRR's tiger scene shoot

    Follow us on

    RRR – NTR : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియాలో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. దాదాపు ఈ సినిమా 1200 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న కొన్ని రికార్డు లను బ్రేక్ చేసింది. ఇక మొత్తానికైతే ఈ ఇద్దరు హీరోలను కలుపుతూ ఒక సినిమా చేయాలనే సాహసం చేసిన ఒకే ఒక దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం. ఎందుకంటే మల్టీ స్టారర్ సినిమా అంటే హీరోల తాలూకు ఇమేజ్ ని రిప్రజెంట్ చేస్తూ సినిమాని తెరకెక్కించాలి.

    ముఖ్యంగా స్టార్ హీరోలను డీల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఒక హీరోను డీల్ చేయడమే చాలా కష్టం అనుకుంటే రాజమౌళి ఇద్దరి హీరోలను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ లో ఒకపక్క తోడేలు, మరోపక్క పులి మధ్యలో పరిగెడుతూ పులిని బంధించే సీన్ గురించి ఆ సినిమా కెమెరామెన్ అయిన సెంథిల్ కుమార్ మాట్లాడుతూ పులి ఎలా పరిగెడుతుందో ఎన్టీఆర్ కూడా అలాగే అంత వేగంగా పరిగెత్తేవాడు తను పరిగెత్తే విధానం చూసి మేము కెమెరాను ఎలా ఆపరేట్ చేయాలో మాకు అర్థం కాలేదు.

    ఇక దానికి తగ్గట్టుగా మళ్లీ ఎన్టీఆర్ వేగాన్ని మేము అందుకోవడానికి సపరేట్ గా కసరత్తులైతే చేశామని చెప్పాడు. నిజానికి ఎన్టీఆర్ ఈ విషయం మీద స్పందిస్తూ నేను చిన్నప్పుడు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడం వల్లే అంత వేగంగా పరిగెత్తనని నాకు పరుగెత్తడం చిన్నప్పటి నుంచి అలవాటైందని చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే నేను ఒకపక్క జంతువుల మధ్యలో పరిగెడుతున్నప్పటికీ నన్ను పరిగెత్తించే మరో జంతువు కూడా ఉంది. అదే రాజమౌళి అంటూ తారక్ నవ్వుతూ చెప్పాడు. ఇక రాజమౌళి సినిమాలోని పాత్ర ఎలాగైతే ఉండలో మనం అలా మారిపోవాలి. మనం కష్టపడుతున్నామని చెప్పి ఆయన మాత్రం ఎక్స్క్యూజ్ చేయడు. తనకు ఏం కావాలో దాన్ని పర్ఫెక్ట్ గా రాబట్టుకునే ప్రయత్నం అయితే చేస్తాడు. దానికోసం 100 టేకులు అయిన సరే చేయడానికి రెడీగా ఉంటాడు తప్ప మనల్ని మాత్రం వదిలిపెట్టడు. అందుకే ఆయన సినిమాల్లోని క్యారెక్టర్లు అంత పర్ఫెక్ట్ గా ఉంటాయని ఎన్టీఆర్ చెప్పాడు.

    ఇక నేను పులి తో పరిగెత్తేటప్పుడు నాకు ఎప్పటికప్పుడు ఇన్ పుట్స్ ఇస్తుండేవాడు. ఒక పులి మనిషి కంటే నాలుగు రెట్లు వేగంగా ముందుకు దుంకుతుంది. అలాంటి పులితో పరిగెత్తినప్పుడు నువ్వు ఎంత వేగంగా పరిగెత్తలో నువ్వే ఆలోచించుకో అని నాకు చెప్పాడు. నేను పరిగెడుతుంటే మైక్ లో ఇంకా ఇంకా వేగంగా పరిగెత్తు తారక్ అంటు అరుస్తూ ఉండేవాడు. అందువల్లే నేను ఆ ఎపిసోడ్ ను అంత పర్ఫెక్ట్ గా చేశానని అనుకుంటున్నానని ఎన్టీఆర్ ఒకానొక సందర్భంలో తెలియజేశాడు…