https://oktelugu.com/

త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ ఇక పట్టాలెక్కినట్టే?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాకు జూనియర్ దాదాపు ఏడాదన్నర పాటు డేట్స్ కేటాయించాడు. ఇక ఈ ఇయర్ తారక్ నుంచి ఎలాంటి సినిమా రావడం లేదు. ఎన్టీఆర్ సినిమా రావాలంటే 2020 జూలై 30 వరకు వెయిట్ చేయాల్సిందే. అందుకే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఆల్రెడీ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో పాటు తమిళ దర్శకుడు అట్లీ.. కొరటాల శివ సినిమాలకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే కదా. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 2, 2021 / 04:37 PM IST
    Follow us on


    జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాకు జూనియర్ దాదాపు ఏడాదన్నర పాటు డేట్స్ కేటాయించాడు. ఇక ఈ ఇయర్ తారక్ నుంచి ఎలాంటి సినిమా రావడం లేదు. ఎన్టీఆర్ సినిమా రావాలంటే 2020 జూలై 30 వరకు వెయిట్ చేయాల్సిందే. అందుకే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఆల్రెడీ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో పాటు తమిళ దర్శకుడు అట్లీ.. కొరటాల శివ సినిమాలకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే కదా. కానీ.. అనూహ్యంగా ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం.

    Also Read: అల్లు అర్జున్ కోసం కాస్లీ ఐటెమ్ గర్ల్ ను తెప్పిస్తున్న సుకుమార్..

    ఆల్రెడీ ప్రశాంత్ నీల్.. మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. అటు కొరటాల శివ ..చిరంజీవి, ప్రభాస్ సినిమాల తర్వాత కానీ ఫ్రీ కాడు. మరోవైపు అట్లీ తమిళంలో మరో సినిమా చేస్తున్నాడు. వీళ్లు ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఎంత లేదన్నా ఏడాదిన్నరకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఎన్టీఆర్ ముందుగా త్రివిక్రమ్‌తో నెక్ట్స్ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎన్టీఆర్ కూడా ‘ఆర్ఆర్ఆర్’లో తన షూటింగ్ పార్ట్ జనవరి కల్ల కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్.. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గ కథ వినిపించడాడట. దానికి తారక్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

    Also Read: అభిజీత్ ఈ పని వల్లే గెలిచాడు.. యాంకర్ ప్రదీప్ హాట్ కామెంట్స్

    ఈ సినిమా మార్చిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాను త్రివిక్రమ్ హారిని అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్‌లో తెరకెక్కించే అవకాశాలున్నాయి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అనూహ్యంగా త్రివిక్రమ్‌తో సినిమా చేస్తుండం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమాతో తారక్, త్రివిక్రమ్‌లు మరో హిట్టు వాళ్ల ఖాతాలో వేసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇక కొత్త ఆంగ్ల ఏడాది ప్రారంభం సందర్భంగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తారక్‌కు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్