https://oktelugu.com/

సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ సూర్యకే?

ఒక్క హిట్.. తమిళ స్టార్ హీరో సూర్య క్రేజ్ నే మార్చేసింది. అదీ ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా ద్వారానే కావడం విశేషం. ఇన్నాళ్లు సూర్య సినిమాలు అయితే తమిళంలో.. లేదంటే తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ లో సూర్య తీసిన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా అందరికీ చేరువైంది. ఈ సినిమా సూర్యలోని నటుడిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2021 / 04:39 PM IST
    Follow us on

    ఒక్క హిట్.. తమిళ స్టార్ హీరో సూర్య క్రేజ్ నే మార్చేసింది. అదీ ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా ద్వారానే కావడం విశేషం. ఇన్నాళ్లు సూర్య సినిమాలు అయితే తమిళంలో.. లేదంటే తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ లో సూర్య తీసిన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా అందరికీ చేరువైంది. ఈ సినిమా సూర్యలోని నటుడిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడి కష్టాలను సూర్య కళ్లకు కట్టేలా నటించి మెప్పించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు సూర్య సినిమాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది.

    Also Read: త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ ఇక పట్టాలెక్కినట్టే?

    ఈ క్రమంలోనే సూర్య ఇప్పుతు తన రాబోయే సినిమాకు భారీ పారితోషికం అందుకోబోతున్నాడు. తమిళనాట టాప్ దర్శకుడిగా పేరున్న వెట్రిమారన్ తో సూర్య నెక్ట్స్ సినిమాను ఒప్పుకున్నాడు. ‘వాడి వాసల్’ పేరుతో తీస్తున్న ఈ చిత్రానికి గాను సూర్య ఏకంగా రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు టాక్.

    Also Read: అల్లు అర్జున్ కోసం కాస్లీ ఐటెమ్ గర్ల్ ను తెప్పిస్తున్న సుకుమార్..

    ఇప్పటిదాకా దక్షిణ భారత్ లో ఉన్న సినిమా ఇండస్ట్రీల అన్నింట్లోనూ ఇదే అతిపెద్ద రెమ్యూనరేషన్ కావడం విశేషం.. తెలుగులో ప్రభాస్ ను మించి సూర్య ఈ రేంజ్ పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు సౌత్ ఇండియా నంబర్ 1 స్టార్ గా సూర్య మారిపోయాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్