Jr NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఏడు విజయాలతో మంచి ఊపు మీదున్నాడు. మరి ఈ సినిమాతో కనక సక్సెస్ ని సాధించినట్లయితే వరుసగా ఎనిమిది సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్న ఏకైక స్టార్ హీరోగా మంచి గుర్తింపునైతే సంపాదించుకుంటాడు. ఇక ఈ జనరేషన్ లో ఉన్న స్టార్ హీరోలు ఎవ్వరు వరుసగా భారీ సక్సెస్ లను అయితే సాధించడం లేదు. కాబట్టి ఎన్టీఆర్ ఈ ఘనత సాధిస్తే ఒక అరుదైన రికార్డు ను సాధించిన హీరోగా మంచి గుర్తింపును పొందడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా సంపాదించుకుంటాడు…
Also Read : నాగ చైతన్య కి ప్రచారకర్త గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్..ఏమైందంటే!
జూనియర్ ఎన్టీఆర్ తో భారీ ప్రాజెక్టులను చేసి ఇద్దరు స్టార్ డైరెక్టర్లు వరుసగా ప్లాపులను ముట్టగట్టుకున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు ఎవరు అంటే అందులో ఒకరు బిగోపాల్ కాగా, మరొకరు సురేందర్ రెడ్డి…ముందుగా బి.గోపాల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ అల్లరి రాముడు(Allari Ramud), నరసింహుడు(Narasimhudu) అనే రెండు సినిమాలు చేశాడు.
ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ బాట పట్టాయి. ఇక దాంతో వీళ్ళిద్దరి కాంబోకి అసలు సెట్ అవ్వలేదని సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేశారు. ఇక ఎన్టీఆర్ తో సినిమా చేసి రెండు ప్లాప్ లను మూటగట్టుకున్న మరో దర్శకుడు సురేందర్ రెడ్డి… ఈయన ఎన్టీఆర్ తో అశోక్, ఊసరవెల్లి అనే రెండు సినిమాలను చేసి రెండు ఫ్లాపులుగా నిలిపాడు.
దాంతో వీళ్ళ కాంబినేషన్ కూడా సెట్ అవ్వలేదు అంటూ మరికొన్ని విమర్శలైతే వచ్చాయి. ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు డైరెక్టర్లు కూడా వరుసగా సినిమాలు చేయడంలో వెనుకబడిపోయారనే చెప్పాలి. మరి ఎన్టీఆర్ మాత్రం పాన్ ఇండియా హీరోగా ఎదగడమే కాకుండా తన రేంజ్ ను అంతకంతకు పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు…
Also Read : లక్ష్మి ప్రణతి బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ఎన్టీయార్…