April New Rules: ఏప్రిల్ 1 అనగానే అందరికీ ఫూల్స్ డే గుర్తుకు వస్తుంది. చిన్నప్పటి నుంచి ఆ విషయమే తెలుసు. కానీ, ఏప్రిల్ 1కి చాలా ప్రాధాన్యం ఉంది. ఏ సంవత్సరంలో అయినా ఫైనాన్షియల్ ఇయర్ మొదలయ్యేది ఏప్రిల్ 1నే. ఆర్థిక వేత్తలు, వ్యాపారులు దీనిని చాలా కీలకంగా భవిస్తారు. 2025–26 ఆర్థికసంవత్సరం ఏప్రిల్ 1 (మంగళవారం) ప్రారంభమైంది.
కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు:
కొత్త పన్ను విధానం (New Tax Regime) కింద, వార్షిక ఆదాయం రూ. 12 లక్షల వరకు ఉన్న వ్యక్తులు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం పొందే వారికి రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది, అంటే రూ. 12.75 లక్షల వరకు జీతం పన్ను రహితంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితి రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచబడింది. TDS (Tax Deducted at Source) పరిమితులు కూడా పెంచబడ్డాయి.
Also Read: ఎండాకాలంలో వీటిని వాడుతున్నారా? అయితే జాగ్రత్త..
UPI సంబంధిత మార్పులు:
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భద్రతా కారణాలతో, గత 12 నెలలుగా ఉపయోగించని మొబైల్ నంబర్లకు లింక్ చేసిన ్ఖ్కఐ ఖాతాలు నిష్క్రియం చేయబడతాయి. బ్యాంకులు మరియు థర్డ్–పార్టీ UPI యాప్‌లు (ఫోన్‌పే, గూగుల్ పే వంటివి) ఈ నిబంధనను అమలు చేయాలి. మార్చి 31, 2025 లోపు సక్రియ మొబైల్ నంబర్‌తో అప్‌డేట్ చేయాలి.
బ్యాంకింగ్ మార్పులు:
SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకులు ఖాతాలలో కనీస బ్యాలెన్స్ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నాయి. దీనిని నిర్వహించని వారిపై జరిమానా విధించవచ్చు. క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల నిబంధనల్లో మార్పులు చేశాయి.
GST నిబంధనలు:
GST పోర్టల్‌లో మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (MFA) తప్పనిసరి చేయబడింది.
E-Way బిల్లులు 180 రోజుల కంటే పాత డాక్యుమెంట్లకు జనరేట్ చేయబడవు.
పెన్షన్ సంబంధిత మార్పులు:
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) అమలులోకి వస్తుంది, ఇది సుమారు 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. 25 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి చివరి 12 నెలల సగటు జీతంలో 50% పెన్షన్ లభిస్తుంది.
ఈ మార్పులు ఆర్థిక ప్రణాళిక, పన్ను చెల్లింపు, డిజిటల్ లావాదేవీలపై ప్రభావం చూపుతాయి. ఖచ్చితమైన వివరాల కోసం సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లను సంప్రదించడం మంచిది.