Devara 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలతో భారీ గుర్తింపును తెచ్చుకొని పాన్ ఇండియాలో ఎలాగైనా సరే భారీ గుర్తింపును సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత సంవత్సరం ఆయన చేసిన దేవర (Devara) సినిమా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించింది. దాదాపు 500 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. అయినప్పటికి ఎన్టీఆర్ రేంజ్ కి తగ్గట్టుగా సక్సెస్ అయితే సాధించలేదని చాలామంది ఈ సినిమా మీద విమర్శలైతే చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ‘దేవర 2’ (Devara 2) సినిమాని కూడా లైన్ లో పెట్టాడు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్(NTR) దేవర 2 సినిమా ఉంటుంది. కానీ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు అని చెప్పాడు. ఇక దేవర 2 సినిమా మీద ప్రతి ఒక్కరు భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం దేవర 2 సినిమాలో మహేష్ బాబు కూడా ఒక చిన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
Also Read : నా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నన్ను బతికించండి అంటు సుకుమార్ ను వేడుకున్న దర్శకుడు…
ఇక కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో దేవర (Devara) సినిమా తెరకెక్కింది. కాబట్టి కొరటాలకి మహేష్ బాబు (Mahesh Babu) మంచి ఫ్రెండ్ అందువల్లే ఈ సినిమాలో తనని భాగం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మహేష్ బాబు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
మరి తను అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ తో పాటు మహేష్ బాబుని కూడా ఈ సినిమాలో చూపిస్తాడా తద్వారా ఆయన కంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ లాంటి నటుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక దానికి అనుగుణంగానే దేవర సినిమా సక్సెస్ సాధించలేదు. కాబట్టి దేవర 2 సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మొత్తానికైతే ఆ సినిమాకి 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టే విధంగా సినిమా ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది…