Jr NTR : సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన పాత్రను పోషిస్తూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 24 సంవత్సరాలు అవుతుంది.దాంతో ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.సాటిలేని మాస్ అప్పీల్, మ్యాగ్నటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎన్టీఆర్ మరో మైలురాయి ని తన ఖాతా లో వేసుకున్నాడు అంటూ ఆ పోస్టర్ లో తెలియజేశారు… ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఆగస్టు 14వ తేదీన ‘వార్ 2’ (War 2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయన భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ (Dragon) సినిమా విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. మరి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా ఉన్నతమైన స్థానంలో నిలిపాయి. కాబట్టి ఇక మీద సాధించబోయే విజయాలు సైతం అతన్ని చాలా గొప్ప రేంజ్ లో నిలబెడతాయని తన అభిమానులైతే భావిస్తున్నారు.
Also Read : సీనియర్ ఎన్టీఆర్ దానం చేసిన పేరు కథ.. ఓ పవర్ ఫుల్ స్టార్ హీరో ఆవిర్భావం…
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాడా? అలాగే తన తోటి హీరోలు అందరితో పోటీపడి నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటికే తన తోటి హీరోలందరూ పాన్ వరల్డ్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
కాబట్టి తను కూడా పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాడు. గత సంవత్సరం వచ్చిన ‘దేవర’ (Devara) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇండస్ట్రీ హిట్ ను మాత్రం నమోదు చేయలేకపోతున్నాడు. మరి ఇప్పుడు రాబోయే సినిమాలతో ఇండస్ట్రీ హీట్ మీద కన్నేసినట్టుగా తెలుస్తోంది…