Jr NTR Name : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కూడా మంచి విజయాలను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం బాధ్యతలను ముందుకు తీసుకెళుతున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా కొనసాగడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నాడు…ఇక ఎన్టీఆర్ పేరు వెనక ఉన్న రహస్యాన్ని హరికృష్ణ ‘నాన్నకు ప్రేమతో’ (Nanna Ki Prematho) సినిమా సమయంలో తెలియజేయడం విశేషం…ఇక ప్రస్తుతం ఆ పేరుకు సంబంధించిన బ్యాక్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
నాన్నకు ప్రేమతో సినిమా ఈవెంట్లో నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ తన ఇద్దరి కొడుకుల పేర్లు జానకిరామ్, కళ్యాణ్ రామ్ అని పెట్టానని జూనియర్ ఎన్టీఆర్ పేరు విషయంలో తను వాళ్ళిద్దరి పేరు వెనకాల రామ్ అని పెట్టాను కాబట్టి ఇతని పేరు వెనకల కూడా రామ్ అని వచ్చేలా తారక్ రామ్ అని పెట్టానని చెప్పాడు. ఒకానొక సమయంలో ‘విశ్వామిత్ర’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణతో మీ మూడో వాడు ఏం చేస్తున్నాడు అని అడిగాడట.
దాంతో హరికృష్ణ చదువుకుంటున్నాడని చెప్పడంతో ఒకసారి వాడిని తీసుకొని రమ్మని చెప్పాడట. అప్పుడు హరికృష్ణ తారక్ రామ్ ను తీసుకువచ్చాడు… ఇక అప్పుడు సీనియర్ ఎన్టీఆర్(Sr NTR) నీ పేరు ఏంటి అని అడగగా నాన్న గారు తారక్ రామ్ అని పెట్టారని చెప్పాడట. ఇక అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కోపంగా తారక్ రామ్ కాదు నీ పేరు ఎన్టీఆర్ నువ్వు నా అంశతో పుట్టావు అంటూ ఆయన చాలా గర్వంగా చెప్పాడట.
ఇక అది చూసిన హరికృష్ణ నాన్నగారు తన పేరును తనే దానం చేసుకున్నాడు. బహుశా ఈ సమయంలో ఆ పేరుకు తగ్గ గుర్తింపును తీసుకొచ్చేవాడు జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన అప్పుడే పసిగట్టి తనకు ఆ పేరు పెట్టారేమో అంటూ చెప్పాడు.ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది…
