Jr NTR and Nelson : నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం బాధ్యతలను ముందుకు తీసుకెళుతున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్…ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా యావత్ తెలుగు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపు రాబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. గత సంవత్సరం దేవర (devara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఈ సినిమా ఆశించడం మేరకు విజయాన్ని సాధించలేదు. పాన్ ఇండియా వైడ్ గా కేవలం 500 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టి ఎన్టీఆర్ (NTR) అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన హృతిక్ రోషన్ (Hruthik Roshan) తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బ్రేక్ చేసి తనకంటూ ఒక సపరేట్ రికార్డును క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాల తర్వాత స్టార్ డైరెక్టర్ నెల్సన్(Nelsan) డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాని తొందరలోనే అధికారికంగా ప్రకటించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ఎన్టీఆర్ ధరించిన ఈ చొక్కా ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!
అయితే జైలర్ (Jailer) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నెల్సన్ ఎన్టీఆర్ కి చెప్పిన స్టోరీ కూడా అద్భుతంగా ఉందట. దానివల్ల ఎన్టీఆర్ సైతం అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక నెల్సన్ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.
ఆయన వాటికి పెద్ద పీట వేస్తూ సినిమాలను చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ సినిమాలో కూడా అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ భారీగా ఉంటే మాత్రం సినిమా మాస్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటుంది. ఇక నెల్సన్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా కథ ఏంటి అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతుంది.
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక మాఫియా డాన్ గా కనిపిస్తారట. అతను అలా ఎందుకు మారాడు? అలా మారడానికి ప్రేరేపించిన పరిస్థితులు ఏంటి? దానివల్ల అతను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు? అనేవి ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇదే అవుట్ లైన్ తో ఈ సినిమా వచ్చి పెను ప్రభంజనాలను సృష్టిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : జూ.ఎన్టీఆర్ సినిమాల్ని చూసి నటులుగా మారిన స్టార్ హీరోలు వీళ్లేనా..?