Allu Aravind: డిసెంబర్ నాల్గవ తేదీన సంధ్య థియేటర్ ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించిన ఘటన యావత్తు ప్రజానీకాన్ని ఎంత శోకానికి గురి చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఆమె కుమారుడు శ్రీతేజ్ ఈ ఘటన లో తీవ్ర గాయాలపాలై నిన్న మొన్నటి వరకు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అపస్మారక స్థితి లో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీతేజ్ వైద్య ఖర్చులతో పాటు, ఆ కుటుంబం బ్రతికేందుకు ఆర్థికసాయం చేశారు. రీసెంట్ గానే ఆ కుర్రాడు పూర్తి స్థాయిలో కోలుకోవడం తో డిశ్చార్జ్ చేసి ఏషియన్ ట్రాన్స్ కేర్ రీహాబిలిటేషన్ సెంటర్ కి తరలించారు. నేడు అక్కడికి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ వెళ్ళాడు.
Also Read: మహేష్ బాబు తో సినిమా చేయాలంటే ఇంత మందికి కథ చెప్పాలా..?
అక్కడి డాక్టర్స్ తో అల్లు అరవింద్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకుంటున్న వీడియో ని మనం క్రింద చూడవచ్చు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది, కానీ తన మనుషులను ఇంకా గుర్తు పట్టడం లేదు. నిన్న మొన్నటి వరకు ఆహారం కూడా గొట్టం ద్వారా తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. శ్రీతేజ్ అపస్మారక స్థితి లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ తన టీం ని పిలిపించి, ఇంకా ఆ అబ్బాయి ఎన్ని రోజులు ఇలా ఉండాల్సి వస్తుంది?, పరిస్థితి మెరుగు పడాలంటే ఏమి చెయ్యాలి?, ఫారిన్ కి తీసుకెళ్లి వైద్యం ఇప్పిస్తే ఏదైనా పురోగతి కనిపిస్తుందా వంటి చర్చలు జరిపాడట. కానీ డాక్టర్లు అలాంటి అవసరం ఏమి లేదని, ఇక్కడే కోలుకుంటాడని అల్లు అర్జున్ టీం కి సమాచారం అందించారట. అల్లు అర్జున్ కూడా జనవరి నెలలో శ్రీతేజ్ ని హాస్పిటల్ కి వెళ్లి చూసాడు.
ఇప్పుడు అల్లు అరవింద్ వచ్చాడు, త్వరలోనే అల్లు అర్జున్ మరోసారి శ్రీతేజ్ ని కలుసుకునే అవకాశం కూడా ఉంది. ఇక ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి తమిళ డైరెక్టర్ అట్లీ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ లుక్ విషయం లో మేక్ ఓవర్ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. సుమారుగా అల్లు అర్జున్ ని ఆయన అభిమానులు 5 ఏళ్ళ నుండి పుష్ప గెటప్ లో చూసి బాగా విసిగిపోయారు. ఒక్కసారిగా ఈ సినిమా కోసం స్టైలిష్ గా తయారు అవుతుండడం చూసి వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఈ సినిమా కోసం ఆయన సిక్స్ ప్యాక్ బాడీ ని కూడా పెంచబోతున్నాడు. రీసెంట్ గానే ఆయన తన ఫిట్నెస్ ట్రైనర్ ని కలుసుకున్న ఫొట సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read: బాలీవుడ్ లో మీనాక్షి చౌదరి కి బంపర్ ఆఫర్స్..వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ లో హీరోయిన్!
#news Sandhya theatre సంఘటన లో గాయపడిన బాలుడిని పరామర్శించిన Allu Aravind pic.twitter.com/UcGGCsAgJJ
— devipriya (@sairaaj44) May 5, 2025