Jr. NTR Fans: నాడు ఎన్టీఆర్ గురించి ఎంతో నీచ్చంగా మాట్లాడాడు ఆ దర్శకుడు.! నేడు ఎంత దుస్థితిలో ఉన్నాడంటే ?

Jr. NTR Fans Revenge: సినిమా ఇండస్ట్రీల్లో హిట్స్ ఉంటే మాట వింటారు. లేకుంటే నువ్వేంత అన్నట్లుగా చూస్తారు. ఈ విషయం ఇండస్ట్రీలోని ప్రతీఒక్కరికి తెల్సిందే. ఈ కారణంగానే హీరోలు, దర్శకులు వరుస విజయాల కోసం పాకులాడుతుంటారు. ఇందుకోసం తమ ఒళ్లు హూనం చేసుకుంటూ ఉంటారు. అయితే కొందరు మాత్రం ఒకటి రెండు హిట్స్ రాగానే కళ్లుమిన్ను కానకుండా అవాకులు చెవాకులు పేలుతుంటారు.   అయితే అలాంటి వాళ్లు ఆ తర్వాతి కాలంలో హిట్స్ లేక ఇండస్ట్రీకి దూరమైన […]

Written By: NARESH, Updated On : April 13, 2022 6:45 pm
Follow us on

Jr. NTR Fans Revenge: సినిమా ఇండస్ట్రీల్లో హిట్స్ ఉంటే మాట వింటారు. లేకుంటే నువ్వేంత అన్నట్లుగా చూస్తారు. ఈ విషయం ఇండస్ట్రీలోని ప్రతీఒక్కరికి తెల్సిందే. ఈ కారణంగానే హీరోలు, దర్శకులు వరుస విజయాల కోసం పాకులాడుతుంటారు. ఇందుకోసం తమ ఒళ్లు హూనం చేసుకుంటూ ఉంటారు. అయితే కొందరు మాత్రం ఒకటి రెండు హిట్స్ రాగానే కళ్లుమిన్ను కానకుండా అవాకులు చెవాకులు పేలుతుంటారు.

 

అయితే అలాంటి వాళ్లు ఆ తర్వాతి కాలంలో హిట్స్ లేక ఇండస్ట్రీకి దూరమైన ఘటనలున్నాయి. ఇదే సమయంలో గతంలో వీరు ఎవరినైతే మాటలు అన్నారో వారితోనే తిరిగి మాటలు పడాల్సిన దుస్థితి వచ్చింది. అందుకే సీనియర్ హీరోలు, దర్శకులు వీలైనంత వరకు హిట్స్, ప్లాపులకు సంబంధం లేకుండా తమ యాట్యూట్డ్ ను కొనసాగిస్తూ అభిమానుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటారు.ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. ఓ దర్శకుడు గతంలో జూనియర్ ఎన్టీఆర్ తనకు తెలియదంటూ డాంభికాలు పలికారు. తీరా ఇప్పుడు ఓ ప్లాపు హీరోతో సినిమా చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆ దర్శకుడిని సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెడుగుడు ఆడుకుంటున్నారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరనేగా మీ సందేహం..!

ఇక అసలు విషయానికొస్తే.. తమిళంలో సూర్యతో ‘సింగం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన దర్శకుడు హరి. మాస్ పల్స్ తెల్సిన దర్శకుడిగా హరికి ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. అయితే ఓ ఇంటర్వ్యూలో మీరు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి? నిజమేనా? అనే ప్రశ్న ఎదురైంది.దీనిపై స్పందించిన హరి తనకు ఎన్టీఆర్ ఎవరో కూడా తెలియదని చెప్పాడు. ఆయన సమాధానంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. అయితే ఆ సమయంలో దర్శకుడు హరి కెరీర్ భారీ విజయాలతో దూసుకెళుతోంది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్టీఆర్ ఎవరో తెలియదన్న దర్శకుడు ఇప్పుడు ఓ ప్లాప్ హీరోతో సినిమా చేస్తున్నాడు.

Jr NTR

ఈ విషయాన్నే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ ఎవరో తెలియదన్న ఈ దర్శకుడికి తెలుగు హీరో గోపిచంద్ కూడా తెలుసా? అంటూ సెటైర్లు వేస్తూ తమ ప్రతీకారం తీర్చుకుంటున్నారు. గతంలో కూడా పొగరుతో మాట్లాడిన హీరోలు, దర్శకులు అంతా కూడా ఆ తర్వాతి కాలంలో ఏటు కాకుండా పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ లిస్టులో ప్రస్తుతం దర్శకుడు హరి కూడా చేరిపోయినట్లే కన్పిస్తోంది.