Jr Ntr :యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో అగ్ర హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నారు తారక్. తాతయ్య, బాబాయి ల పేరును కాపాడుతూ వారి పేరుకు తగ్గ వారసుడిగా దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. నటనలో అయిన, డాన్స్ లో అయిన, తనకు తానే పోటీ అనేంతలా మెప్పించగలరు ఎన్టీఆర్. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు తారక్. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ… కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు భార్య లక్ష్మీ ప్రణతితో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, ఇతర స్నేహితులతో కలిసి ఎన్టీఆర్ పార్టీ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇటీవల జిమ్ లో చిన్న గాయం అవ్వడం వల్ల తారక్ చేతికి బ్యాండేజీ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ ఫోటోలలో కూడా ఎన్టీఆర్ చేతికి కట్టుతో కనిపించాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు.
కాగా వీరి సరసన ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్స్ నటిస్తున్నారు. మెగా , నందమూరి ఫ్యామిలీలకు చెందిన హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా 2020 జనవరి 7 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నారు.