Homeఎంటర్టైన్మెంట్Pawan kalyan: పవన్​ కళ్యాణ్​ సినిమాలో హీరోయిన్​గా తప్పుకోనున్న పూజా హెగ్డె.. కారణం ఇదే!

Pawan kalyan: పవన్​ కళ్యాణ్​ సినిమాలో హీరోయిన్​గా తప్పుకోనున్న పూజా హెగ్డె.. కారణం ఇదే!

Pawan kalyan: వకీల్​ సాబ్​ సినిమాతో చాలా కాలం తర్వాత బాక్సాఫీసును పలకరించి  సూపర్​ హిట్​ కొట్టారు పవర్​స్టార్​ పవన్​ కళ్యాణ్​. ఇదే జోరుతో భీమ్లా నాయక్​, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తూ.. వరుసగా షూటింగుల్లో ఫుల్​ బిజీగా ఉన్నారు. దీంతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు. మరోవైపు గబ్బర్​సింగ్​తో సూపర్​ డూపర్​ హిట్​ కొట్టిన హరీశ్​ శంకర్​.. మరోసారి ఇదే కాంబినేషన్​లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. దీనికి భవదీయుడు భగత్​సింగ్​ అనే టైటిల్​ అనుకున్నట్లు తెలుస్తోంది.

Pawan kalyan

అయితే, ఈ సినిమాకు హీరోయిన్​గా పూజా హెగ్డెను ఎంచుకున్నట్లు గతంలో హరీశ్​ శంకర్​ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్​ ఆలస్యం అవుతుండటం వల్ల పవన్​ సినిమా నుంచి పూజా తప్పుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ సినిమా షూటింగ్​ మొదలవడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పవన్​ ప్రస్తుతం వర్క్​ చేస్తున్న సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదల కానున్నాయి. ఆ తర్వాతే హరీశ్​ శంకర్​ సినిమా మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఇప్పటికే వరుస అప్​డేట్స్​తో భీమ్లానాయక్​పై టాప్​ రేంజ్​లో అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా, లాలా భీమ్లా పేరుతో మాస్​ సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో పవర్​స్టార్​ ఫుల్​ మాస్​లుక్​తో అదరగొట్టారు. త్రివిక్రమ్​ ఈ పాటకు రచన అందించారు. తమన్​ స్వరాలు సమకూర్చారు. సాగర్​ కె. చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular