Jr NTR Birthday Special: తెలుగు తెర పై తిరుగులేని ఈ తరం కథానాయకుడు ‘జూ.ఎన్టీఆర్’. అలనాటి ఎన్టీఆర్ నట వైభవానికి, నట కీర్తికి కొనసాగింపే.. ఇప్పటి ఎన్టీఆర్ నట సామర్ధ్యం. ఏ నటుడైన సామాన్య ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు, రసజ్ఞులైన ప్రేక్షకుల గుండెల్లో కూడా సుస్థిర స్థానం సంపాదించడం అంటే, అది అంత సామాన్యమైన విషయం కాదు, కానీ ఆ ఘనత, ఆ నాటి ఎన్టీఆర్ కే కాదు, నేటి ఎన్టీఆర్ కి కూడా సాధ్యం అయ్యింది.

నటన జూ.ఎన్టీఆర్ లోని రక్తం, నాట్యం జూ.ఎన్టీఆర్ కున్న వరం. అసలు ఒక మనిషి ఎన్ని రంగాల్లో రాణించగలడు ? జూ.ఎన్టీఆర్ ను చూస్తే ఎన్ని రంగాల్లో అయినా రాణించగలడు అనిపిస్తోంది. తారక్ కూచిపూడి డ్యాన్సర్ గా సక్సెస్. స్టార్ హీరోగా సక్సెస్, టెలివిజన్ షో నిర్వాహకుడిగా సక్సెస్, నేపథ్య గాయకుడిగా సక్సెస్, అన్నిటికీ మించి రాజకీయ యువనేతగా సక్సెస్. ఈ తరంలో ఇలా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్న ఏకైక స్టార్ హీరో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే.
Also Read: Heroes Who Married Item Girls: ఐటమ్ సాంగ్స్ చేసేవారిని వివాహం చేసుకున్న హీరోలు వీరే
ఎన్టీఆర్ ఏమీ పెట్టి పుట్టలేదు, ఆకాశం నుంచి ప్రత్యేకంగా దిగిరాలేదు. సామాన్య జనంలో నుంచే వచ్చాడు, కష్టాన్ని కూడా ప్రేమించడం తెలిసిన వ్యక్తిగా పరిణితి చెందుతూ పెరిగాడు. అవమానాలను కూడా గౌరవించడం నేర్చుకున్న వ్యక్తత్వం జూ.ఎన్టీఆర్ ది. సహజమైన నటనకు, భిన్నమైన డైలాగ్ డెలివరీకి, విభిన్నమైన డ్యాన్స్ మూమెంట్స్ కు నేడు జూ.ఎన్టీఆర్ కేరాఫ్ అడ్రస్ కావొచ్చు. కానీ వాటి వెనుక జీవితకాలపు మానసిక సంఘర్షణ ఉంది.

చెప్పుకోవడానికి భారీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా.. సినిమాల్లోకి తారక్ అనామకుడిగానే వచ్చాడు. కానీ, అతి తక్కువ టైంలోనే తనకంటూ సినీ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నిజమైన విజేత జూ.ఎన్టీఆర్. నటనలోనే కాదు, వ్యక్తిగతంగానూ ఎన్టీఆర్ ఆరని మంటే. 11 ఏళ్ల వరకూ తాత సీనియర్ ఎన్టీఆర్ను కలుసుకునే అదృష్టమే కలగలేదు. ఇలాంటి మనవడికి ఆ తాత వారసత్వం వస్తోందని ఎవరైనా ఊహించగలరా ? కానీ, దైవ నిర్ణయం కదా.

ఓ రోజు మనవడిని చూడాలని ఉందంటూ స్వర్గీయ ఎన్టీఆర్ కబురు పంపగా.. జూనియర్ ఎన్టీఆర్ తాత గారి దగ్గరికి భయం భయంగానే వచ్చాడు. అచ్చం తన పోలికతోనే ఉన్న తారక్ ను చూసి పులకించి పోయారు ఎన్టీఆర్ గారు. ‘వీరు మా వారసుడు, వీరికి మా పేరు ఉండాలి’ అంటూ స్వయంగా నందమూరి తారక రామారావు అని తారక్ కి పేరు పెట్టారు ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనూ సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టాలని ఆశిద్దాం.
Also Read:Sai Pallavi SVP Movie : మహేష్ బాబు మూవీ చూసేందుకు మారువేషంలో వచ్చిన సాయిపల్లవి.. వైరల్ వీడియో
Recommended Videos
[…] Read:Jr NTR Birthday Special: ఎన్టీఆర్ సక్సెస్ వెనుక జీవి… Recommended […]
[…] Also Read: Jr NTR Birthday Special: ఎన్టీఆర్ సక్సెస్ వెనుక జీవి… […]
[…] Also Read:Jr NTR Birthday Special: ఎన్టీఆర్ సక్సెస్ వెనుక జీవి… […]