Johny Lever Life Story: తనకు వచ్చిన పనిచేసి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇతను ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్ కమెడియన్. ప్రస్తుతం ఈ కమెడియన్ 250 కోట్లకు అధిపతి. తన సహజమైన నటనతో, తన కామెడీ టైమింగ్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగు కుటుంబానికి చెందిన ఇతను బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడు అని చెప్పడంలో సందేహం లేదు. చిన్నతనం నుంచి ఎన్నో ఆర్థిక సమస్యలను అలాగే కష్టాలను చూశాడు. ఆర్థిక సమస్యల కారణంగా ఏడవ తరగతి వరకు మాత్రమే చదువు కొనసాగించాడు. చదువుకోవడానికి పూనే వీధులలో పెన్నులు కూడా అమ్మేవాడు.
నటనపై తనకున్న ఇష్టంతో సినిమా రంగానికి చెందిన తారల మిమిక్రీ చేసేవాడు. పలు హిందీ పాటలకు తన స్టైల్ లో డాన్స్ కూడా చేసి అలరించేవాడు. ఇప్పుడు మన దేశ సినిమా ఇండస్ట్రీలో ఇతను ఫేమస్ కమెడియన్. ఇతని ఆస్తులు ఏకంగా 250 కోట్లకు పైగా ఉంటాయని అంచనా. ఇతను ఎవరో కాదు హిందీ సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయినా జానీ లివర్. జానీ లివర్ అచ్చ తెలుగు ఫ్యామిలీ కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నతనంలో తన తండ్రి మద్యానికి బానిస అవడంతో తన కుటుంబ బాధ్యతలను తనే తీసుకున్నాడు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా చూశాడు. 13 ఏళ్ల అతి చిన్న వయసులో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు. బీర్ బైసెప్స్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జానీ లివర్ 13 ఏళ్ల వయసులో తను చనిపోవాలని అనుకున్నానని అందుకే రైల్వే ట్రాక్ కు వెళ్లానని తెలిపాడు. కానీ ఆ సమయంలో తన ముగ్గురు చెల్లెలు తనకు గుర్తుకు రావడంతో వెంటనే రైల్వే ట్రాక్ నుంచి దూరంగా పారిపోయారని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు జానీ లివర్.
తన నిజ జీవిత అనుభవాల నుంచే జానీ లివర్ కామెడీ ని పుట్టించాడు. తను ఇప్పుడు ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం చిన్నతనం నుంచి తను చేసిన పోరాటమే అని జానీ లివర్ ఎప్పుడు చెప్తుంటారు. హిందీలో ఇతను బాజీగర్, తేజాబ్, కిలాడి, కరణ్ అర్జున్, రాజా హిందుస్తానీ, కావున ప్యార్ హై, కబీ ఖుషి కభీ గం, కూలి నెంబర్ వన్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆదరించారు. దాదాపు 300కు పైగా బాలీవుడ్ సినిమాలలో నటించి ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇతను ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ కమెడియన్.