Tragic Life Of Actress Nagma: అప్పట్లో ఈమె సౌత్ సినిమా ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా గ్లామరస్ హీరోయిన్గా బాగా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో సమానంగా సినిమాలు చేసి పారితోషకం కూడా హీరోలతో సమానంగా అందుకుంది. అప్పట్లో ఈమె క్రేజ్ కు స్టార్ డైరెక్టర్ సైతం ఆమెతో సినిమా చేయడానికి క్యూ కట్టేవారు. సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వసాధారణంగా వినిపిస్తాయి. అప్పటినుంచి ఇప్పటివరకు చాలామంది హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఎఫైర్స్ విషయంలో నిత్యం వార్తల్లో ఉంటారు. ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఇద్దరు ముగ్గురు హీరోలతో ఎఫైర్ పెట్టుకున్నారు అనే వార్తలు కూడా సామాజిక మాధ్యమాలలో వినిపిస్తూ ఉంటాయి. అలాగే ఇండస్ట్రీలో పెళ్లిళ్లు మరియు విడాకులు కూడా ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా వినిపిస్తున్నాయి. కానీ అప్పటి ఒక స్టార్ హీరోయిన్ మాత్రం పెళ్లయిన ఒక స్టార్ హీరో తో ఎఫైర్ పెట్టుకుని ఎక్కువగా వార్తల్లో నిలిచింది.
అప్పట్లో ఈ హీరోయిన్ ఒకే సమయంలో ముగ్గురితో లవ్ ఎఫైర్ నడుపుతుందని ఎక్కువగా వార్తలు వినిపించాయి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలతోనే కాకుండా ఒక స్టార్ క్రికెటర్ తో కూడా ఆమె ప్రేమాయణం నడిపింది. అప్పట్లో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ఏలిన ఈ హీరోయిన్ మరెవరో కాదు అప్పటి కుర్రాళ్ల కలల రాణి హీరోయిన నగ్మా. మెగాస్టార్ చిరంజీవి సినిమాతో నగ్మా హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి, నగ్మా జోడిగా నటించారు. తొలి సినిమాతోనే నగ్మా టాలీవుడ్ లో సూపర్ హిట్ విజయం అందుకుంది. ఆ తర్వాత నగ్మా తెలుగులో చాలా సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అప్పట్లో నగ్మా స్టార్ హీరోయిన్గా తెలుగుతోపాటు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా బాగా ఫేమస్ అయ్యింది. కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే నగ్మా లవ్ ఎఫైర్స్ తో సినిమా ఇండస్ట్రీలో చర్చల్లో నిలిచింది. కెరియర్ ప్రారంభంలో నగ్మా హిందీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నగ్మా హిందీ తో పాటు తెలుగు, కన్నడ, తమిళ్ భాషలలో కూడా హీరోయిన్గా అవకాశాలు అందుకుంది.
ఈమె అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ. సినిమాలలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన పేరును నగ్మాగా మార్చుకుంది. అప్పట్లో ఈమె స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో లవ్ ఎఫైర్ నడుపుతుంది అని వార్తలు వినిపించాయి. అప్పటికే క్రికెటర్ గంగోలికి పెళ్లి అయ్యింది. అయినప్పటికీ కూడా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అనే వార్తలు అప్పట్లో బాగా వినిపించేవి. ఇక తర్వాత తమిళ్ స్టార్ హీరో శరత్ కుమార్ తో కూడా నగ్మా ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపించాయి. రేసుగుర్రం విలన్ రవి కిషన్ తో కూడా నగ్మా ప్రేమలో పడింది అనే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం 49 ఏళ్ళ వయసులో నగ్మా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా రాజకీయలో బిజీగా గడుపుతుంది.