https://oktelugu.com/

Johnny Movie: జానీ సినిమా సూపర్ హిట్ అవ్వాల్సింది కానీ పవన్ కళ్యాణ్ చేసిన తప్పు అదే…

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు ఇటు సినిమాలు రెండు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ అప్పట్లో ఆయన హీరోగా వచ్చిన జానీ సినిమా ప్లాప్ అయింది.

Written By:
  • Gopi
  • , Updated On : October 2, 2023 / 01:04 PM IST
    Follow us on

    Johnny Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ని మించిన స్టార్ హీరో లేడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని క్రేజ్ పవన్ కళ్యాణ్ సొంతం అని ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు సైతం చెప్తూ ఉంటారు.ఆయనకి 10 సంవత్సరాల వరకు కూడా ఒక్క సక్సెస్ లేకపోయినా కొంచెం కూడా ఆయన ఇమేజ్ అనేది తగ్గలేదు…అలా 10 సంవత్సరాలు తన స్టార్ డమ్ ని అలాగే మైంటైన్ చేస్తూ వచ్చారు అంటే మామూలు విషయం కాదు.ఇప్పుడున్న స్టార్ హీరోలు సైతం ఒకటి,రెండు ప్లాప్ లు వచ్చాయంటే చాలు వాళ్ల క్రేజ్ చాలా కిందికి పడిపోతుంది.కానీ పవన్ కళ్యాణ్ కి 10 సంవత్సరాలు హిట్టు లేకపోయిన తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిందే కానీ, అసలు తగ్గలేదు అందుకే ఇప్పుడు ఆయన ఎంత రెమ్యున్ రేషన్ అడిగితే అంత ఇచ్చి సినిమాలు చేయించుకోవడానికి ప్రొడ్యూసర్లు రెడీ అవుతున్నారు, కానీ పవన్ కళ్యాణ్ కి అంత రెమ్యునరేషన్ ఇవ్వడం ఎందుకు అని ఏ ఒక్క ప్రొడ్యూసర్ కూడా ఆలోచించడం లేదు.

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు ఇటు సినిమాలు రెండు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ అప్పట్లో ఆయన హీరోగా వచ్చిన జానీ సినిమా ప్లాప్ అయింది. అయితే ఈ సినిమా కూడా చూడడానికి బాగున్నప్పటికీ ప్రేక్షకుల్ని అంతలా మెప్పించలేకపోయింది.దానికి కారణం ఏంటంటే దీనికి ముందు సినిమా అయిన ఖుషి ఇండస్ట్రీ హిట్టు కొట్టి పవన్ కళ్యాణ్ క్రేజ్ తారాస్థాయిలో ఉన్న సమయంలో జానీ సినిమా రావడం కూడా ఆ సినిమాకి చాలా వరకు మైనస్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఇంకో మైనస్ ఏంటంటే ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ హీరోగా చేయకుండా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ డైరెక్షన్ మాత్రమే చేసి అప్పుడప్పుడే ఇండస్ట్రీ లో ఎదుగుతున్న ఒక చిన్న హీరోని పెట్టి ఆ సినిమా తీసి ఉంటే బాగుండేది. అలా అయితే ఆ హీరో మీద ఏ అంచనాలు ఉండవు కాబట్టి కథ మాత్రమే హీరోగా మారేది దాంతో ఆ సినిమా మంచి హిట్ అయ్యేది. కానీ పవన్ కళ్యాణ్ హీరోగా చేయడం వల్ల ఆయన ఇమేజ్ కి తగ్గ కథ ఇది కాకపోవడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయింది అంతే తప్ప పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో గానీ, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ లో గానీ ఎంత మాత్రం తప్పులేదనే చెప్పాలి. ఆయన ఆ సినిమా మీద ఎంత ఎఫర్ట్ అయితే పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టీ కష్టపడినప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదు దానికి కారణం కూడా ఆయన ఇమేజ్ అనే చెప్పాలి…

    ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తూ దూకుడు మీదున్నాడు. రీసెంట్ గా బ్రో సినిమా రిలీజ్ చేశారు.ఇక దానికి తగ్గట్టుగానే సుజీత్ తో చేస్తున్న ఓజీ సినిమాని కూడా తొందర్లోనే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక దీంతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న వస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలతో పవన్ కళ్యాణ్ వరుసగా బాక్స్ ఆఫీస్ పైన దండయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…ఆయన హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ అనేది పెరుగుతూ ఉండడం మిగతా హీరోలందరి కి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది…