Homeఎంటర్టైన్మెంట్Johnny movie 23 years: 'జానీ' చిత్రానికి 23 ఏళ్ళు.. సినిమా ఫ్లాప్.. కానీ ఇండియన్...

Johnny movie 23 years: ‘జానీ’ చిత్రానికి 23 ఏళ్ళు.. సినిమా ఫ్లాప్.. కానీ ఇండియన్ సినిమాకు లెజండరీ డైరెక్టర్స్ ని అందించింది..

Johnny movie 23 years: కెరీర్ ప్రారంభం నుండి ఖుషి వరకు నాన్ స్టాప్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్లు, ఒక దానిని మించి ఒకటి. యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ సరైనది ఒక్కటి పడితేనే ఆడియన్స్ మెంటలెక్కిపోతారు. అలాంటిది వరుసగా 7 సెన్సేషనల్ యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్స్ పడితే ఎలా ఉంటుంది?, ఆ క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఊహించడం మన తరం అవుతుందా ?, సరిగ్గా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి ఇలాంటి క్రేజ్ ఉండేది. ‘ఖుషి’ సమయానికి ఆయన సౌత్ లో రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నోడికి నిలిచాడు. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ నుండి విడుదలైన ‘జానీ’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యింది అందరికీ తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విడుదలకు ముందు ఈ సినిమాపై ఉన్నంత అంచనాలు అంతకు ముందు ఏ సినిమా పై ఉండేది కాదు.

అప్పుడే కాదు , ఇప్పుడు కూడా ఈ సినిమా హైప్ ని మ్యాచ్ చేసిన సినిమానే లేదు. ఆంధ్ర ప్రదేశ్ యువత మొత్తాన్ని ఈ సినిమా మేనియా లో మునిగి తేలిపోయేలా చేసాడు పవన్ కళ్యాణ్. అలాంటి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అంత పెద్ద ఫ్లాప్ అవ్వడానికి కారణం , అప్పటి ఆడియన్స్ కి అది చాలా అప్డేట్ వెర్షన్ సినిమా. పైగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో సింక్ సౌండ్ ని మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు . అంటే ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ చేస్తున్న సమయం లోనే వాయిస్ రికార్డు చేయొచ్చు అన్నమాట. అయితే అప్పట్లో ఈ ప్రయోగం వర్కౌట్ అవ్వలేదు. సినిమా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. అంతే కాకుండా స్క్రీన్ ప్లే కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది.

అందుకే అప్పటి ఆడియన్స్ కి ఎక్కలేదు. అంతే కాదు , ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో మార్షల్ ఆర్ట్స్ మీద తెరకెక్కిన ఏకైక సినిమా ఇదేనట ఆరోజుల్లో . ఫైట్స్ , పాటలు అప్పట్లో ఒక సెన్సేషన్. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా, ఈ చిత్రానికి వీరాభిమానులు ఉన్నారు. దర్శకుడిగా పవన్ కళ్యాణ్ మేకింగ్ స్టైల్ ని నచ్చి ఇండస్ట్రీ లోకి మేము కూడా రావాలి అని కోరిక పుటించేలా చేసాడు. అలాంటి వారిలో సందీప్ వంగ, సుజిత్ వంటి టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా సుజిత్ అయితే ఈ చిత్రాన్ని చూసే పవన్ కి వీరాభిమాని అయ్యాడట . ఒకవేళ జానీ లేకపోయుంటే ఈరోజు ‘ఓజీ’ ఉండేది కాదు అంటూ సుజిత్ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు సుజిత్. అలా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇద్దరు టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఎంట్రీ ఇవ్వడానికి కారణమైంది అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి ఈ సినిమా వచ్చి నేటికి 23 ఏళ్ళు అయ్యింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular