
Shivathmika : క్రాప్ టాప్ లెహంగాలో అద్భుతం చేసింది శివాత్మిక రాజశేఖర్. ఈ యంగ్ బ్యూటీ సూపర్ గ్లామరస్ లుక్ వైరల్ గా మారింది. స్లీవ్ లెస్ టాప్ కావడంతో శివాత్మిక ఎద అందాలు హైలెట్ అయ్యాయి. ఈ తెలుగమ్మాయిని ఇలా చూడటం కష్టమే అంటున్నారు. తన సహజ అందాలతో నేరుగా గుండెల్లో పాగా వేసింది. ది ఆంటోరా టీచ్ ఫర్ ఛేంజ్ యాన్వల్ ఫండ్ రైజర్ 2023 ఈవెంట్లో పాల్గొనేందుకు శివాత్మిక ఇలా ట్రెండీ అండ్ ట్రెడిషనల్ గా సిద్ధమయ్యారు. అదే సమయంలో గ్లామర్ యాంగిల్ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డారు.

ఇక రాజశేఖర్ దంపతుల కూతురిగా పరిశ్రమలో అడుగు పెట్టింది శివాత్మిక. దొరసాని ఈ స్టార్ కిడ్ డెబ్యూ మూవీ. 2019లో విడుదలైన దొరసాని పీరియాడిక్ ట్రాజిక్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. ఆనంద్ దేవరకొండ కూడా ఇదే చిత్రంతో పరిశ్రమకు పరిచయమయ్యాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్ గా ఆడలేదు.ట్రాజిక్ ఎండింగ్స్ తెలుగు ప్రేక్షకులు ఇష్టపడరని మరోసారి రుజువైంది.

ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు అవుతున్నా బ్రేక్ రాలేదు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్ అయ్యే హిట్ పడలేదు. గత ఏడాది పంచతంత్రం తో పాటు ఆకాశం చిత్రాల్లో శివాత్మిక నటించారు. ఫీల్ గుడ్ చిత్రాలుగా పేరు తెచ్చుకున్న ఈ రెండు ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి.ఇక రంగమార్తాండ మూవీ ఆమెకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ఇది కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. దర్శకుడు కృష్ణవంశీ మరాఠీ చిత్రం నటసామ్రాట్ రీమేక్ గా తెరకెక్కించారు. ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేశారు. వారి కూతురు పాత్రలో శివాత్మిక నటించనున్నారు. ఇటీవల కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అవి సినిమా మీద ఆసక్తి రేపాయి.

రాహుల్ సిప్లిగంజ్-శివాత్మిక వధూవరులుగా పెళ్లి పందిరిలో కూర్చొని ఉన్నారు. సదరు వర్కింగ్ స్టిల్ లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ సైతం ఉన్నారు. ఈ సినిమా విజయం సాధించినా శివాత్మికకు ఇమేజ్ తెచ్చిపెడుతుందనే గ్యారంటీ లేదు. అయితే నటిగా నిరూపించుకుంటే దర్శక నిర్మాతల కంట్లో పడే మార్గం దొరుకుతుంది. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కి అంతగా కెరీర్ ఉండదు. అందుకే తమిళ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. మరోవైపు శివాత్మిక అక్క శివాని కూడా స్ట్రగుల్ అవుతున్నారు. అద్భుతం మూవీతో శివాని హీరోయిన్ అయ్యారు. రాజశేఖర్ సినిమా వారసురాళ్లు శివాని, శివాత్మిక ఏ స్థాయికి వెళతారో చూడాలి…