
Sir Collections : ఈ ఏడాది తమిళ హీరోల సినిమాలు మన టాలీవుడ్ లో తెగ ఆడేస్తున్నాయి.మొన్నీమధ్యనే సంక్రాంతి కానుకగా విడుదలైన తమిళ స్టార్ హీరో విజయ్ ‘వారసుడు’ చిత్రం సూపర్ హిట్ గా నిలవగా, రీసెంట్ గా విడుదలైన ధనుష్ ‘సార్’ చిత్రం మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.చదువు యొక్క గొప్పదనం ని తెలియచేస్తూ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ప్రస్తుతం ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు చూస్తూ ఉంటే ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాదిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.కేవలం మూడు రోజుల్లోనే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో 9 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసిన సార్ చిత్రం, వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతుంది.
సోమవారం రోజు కూడా ఈ సినిమాకి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట.ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ సినిమాల తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూలు కడుతున్నది దీనికే.సాధారణం గా ఏ సినిమాకి అయినా మంగళవారం రోజు వసూళ్లు బాగా తక్కువ ఉంటాయని చెప్తుంటారు, కానీ ‘సార్’ సినిమాకి మంగళవారం రోజు కూడా మంచి వసూళ్లు వచ్చాయట.
5వ రోజు కూడా ఈ సినిమాకి దాదాపుగా కోటి రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయని, మొత్తం మీద 5 రోజులకు కలిపి కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 12 కోట్ల రూపాయిలు వచ్చిందని,అలా వారసుడు మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ని ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే దాటేసిందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.