Jio Hotstar: ఓటీటీ యాప్స్ లో మన తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఉపయోగించే యాప్ జియో హాట్ స్టార్(Jio Hotstar). నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ తో పాటు, స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ప్రతీ కంటెంట్ ఇందులో అందుబాటులో ఉండడం తో ఆడియన్స్ ఎక్కువగా ఈ యాప్ ని ఉపయోగిస్తూ ఉంటారు. IPL సీజన్ కూడా ప్రతీ ఏడాది ఈ యాప్ లోనే స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది. ఒకానొక సమయం లో 50 కోట్ల మందికి పైగా IPL మ్యాచులను లైవ్ గా చూసేవారు ఈ యాప్ లో. గత ఏడాది వరకు ఈ యాప్ డిస్నీ మరియు సోనీ సంస్థ చేతుల్లో ఉండేది. ఈమధ్యనే ఈ యాప్ ని జియో సంస్థ కొనుగోలు చేసింది. ఎప్పుడైతే ఈ యాప్ జియో చేతుల్లోకి వెళ్లిందో, అప్పటి నుండి ఈ యాప్ ని ఉపయోగించేవారు క్రమంగా తగ్గుతూ వస్తున్నారు.
Also Read: చంద్రబాబు ప్రభుత్వం పై మరో బాంబు పేల్చిన ఆర్కే
కారణం క్వాలిటీ బాగా తగ్గిపోవడమే అని అంటున్నారు విశ్లేషకులు. ప్రతీ వీడియో కి మధ్యలో లెక్కలేనన్ని యాడ్స్ రావడం ప్రేక్షకులకు చిరాకు కలిగించేస్తుంది. ఒక సినిమా ఈ యాప్ లో చూడాలని అనుకున్న ప్రేక్షకుడికి చుక్కలు కనిపించేస్తున్నాయి. అందుకే ఎవ్వరూ కూడా వీడియో ని పూర్తిగా చూడలేకపోతున్నారు. అంతే కాదు వీడియో క్వాలిటీ కూడా చాలా చీప్ గా ఉంటున్నాయి. కాస్త క్వాలిటీ రిజల్యూషన్ పెంచితే వీడియో బాగా బఫర్ అయిపోతుంది. ఈ కారణం చేత సహనం కోల్పోయిన ప్రేక్షకులు సబ్ స్క్రిప్క్షన్స్ ని రద్దు చేసుకుంటున్నారు. హాట్ స్టార్ హిస్టరీ లో ఇలా జరగడం ఇదే తొలిసారి అట. కొంతమంది అయితే సోషల్ మీడియా వేదికగా జియో సంస్థ అధినేత ముకేశ్ అంబానీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయన చేతుల్లోకి ఈ యాప్ వెళ్లినప్పటి నుండి దరిద్రంగా తయారైందని, ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ యాప్ ని ఉపయోగించే వాళ్ళు ఎవ్వరూ ఉండరని అంటున్నారు. మరి భవిష్యత్తులో అయినా హాట్ స్టార్ తమ సేవలను మెరుగుపర్చుకుంటారో లేదో చూడాలి.