Pawan Kalyan National Politics: ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఎక్కువగా నేషనల్ సమస్యలపై మాట్లాడడం మనం గమనిస్తూనే ఉన్నాం. మన రాష్ట్రంలో ఇప్పుడు సనాతన ధర్మం అంశం గురించి ఇంతమంది సీరియస్ గా చర్చించుకుంటున్నారంటే అందుకు కారణం పవన్ కళ్యాణే. ఈ అంశం ఆయనకు బోలెడంత పాజిటివిటీ తో పాటు, భారీ నెగిటివిటీ ని కూడా తెచ్చిపెట్టింది. అవసరమా మనకి ఇలాంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడుకోవడం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఎన్నోసార్లు అనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇది కాసేపు పక్కన పెడితే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం లో ఆయన బీజేపీ పార్టీ కి ఏ రేంజ్ లో ప్రచారం చేసాడో మనమంతా చూసాము. వచ్చే ఏడాది తమిళనాడు లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన బీజేపీ తరుపున ప్రచారం చేయబోతున్నాడు. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలపై ఈమధ్య ఆసక్తి కలిగినట్టు ఉంది, త్వరలోనే కేంద్ర క్యాబినెట్ లోకి ఆయన అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నాడా అనే సందేహాలు వ్యక్తం చేస్తూ గతం లో కొంతమంది విశ్లేషకులు కామెంట్స్ చేశారు.
Also Read: చంద్రబాబు ప్రభుత్వం పై మరో బాంబు పేల్చిన ఆర్కే
జనసేన పార్టీ ఇంకా తెలుగు రాష్ట్రాల్లోనే పూర్తిగా విస్తరించలేదు. టీడీపీ, వైసీపీ పార్టీలకు ఉన్నట్టుగా క్షేత్రస్థాయిలో జనసేన కి బలమైన నిర్మాణం ఇంకా జరగలేదు, ఇక్కడే పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, ఇక నేషనల్ పాలిటిక్స్ వైపు ఆలోచించడం ఏంటి?, ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే, NDA లో ఉన్నాడు కాబట్టి BJP కి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసి ఉంటాడు. అంతకు మించి ఏమి లేదంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ వైజాగ్ లో తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ దిశా నిర్దేశం చేసాడు. మూడు రోజుల పాటు పాటు సాగిన ఈ సమావేశాలు నిన్నటి భారీ బహిరంగ సభతో ముగిసింది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ని ఎలా బలోపేతం చెయ్యాలి అనే దానిపై ఆయన తన కార్యకర్తలకు కీలకంగా సందేశం అందించాడు. సభ్యత్వం ఉన్న కొంతమంది కీలకమైన కార్యకర్తలకు నేరుగా జనసేన పార్టీ పెద్దనాయకులతో అందుబాటులోకి ఉండే వ్యవస్థ ని తీసుకొని రాబోతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు.
ఇక ఆ తర్వాత భవిష్యత్తులో జనసేన పార్టీ ఎలా ఎదగబోతుందో చెప్తూ, చాలా మంది ఇతర రాష్ట్రాలకు సంబందించిన వాళ్ళు నన్ను కలిసి పార్టీలో చేరుతామని, సభ్యత్వం తీసుకుంటామని చెప్పారని, కానీ కేవలం పార్టీ లో చేరడం మాత్రమే కాదు, సమస్యలపై బలంగా జనం లో నిలబడి పోరాడే శక్తి ఇతర రాష్ట్రాల్లో నన్ను అభిమానించే అభిమానుల్లో వచ్చిన రోజు కచ్చితంగా జనసేన పార్టీ గుర్తిస్తుందని, జాతీయ రాజకీయాల వైపు అప్పుడు మాత్రమే ఆలోచిస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలను చూస్తుంటే, నేషనల్ లెవెల్ లో జనసేన పార్టీ ని తీసుకెళ్లాలి అనే ఆలోచన ఆయన లో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అందుకు చాలా సమయం ఉంది. బహుశా మరో దశాబ్దం సమయం పట్టొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
