Jigarthanda Double X Collection: దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా తెరకెక్కిన చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్. ఎస్ జే సూర్య మరో ప్రధాన పాత్ర చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ 2014 లో తెరకెక్కించిన జిగర్ తండ కల్ట్ క్లాసిక్ గా మిలిగింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు నటుడు బాబీ సింహకు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. అదే టైటిల్ తో తెరకెక్కిన జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
జిగర్ తండ చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రొమోషన్స్ మొత్తం కలుపుకుని రూ. 65 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు సమాచారం. ఒక వరల్డ్ వైడ్ జిగర్ తండ థియేట్రికల్ రైట్స్ రూ. 36 కోట్లకు అమ్మారు. ఏపీ/తెలంగాణ రాష్ట్రాల హక్కులు రూ. 6 కోట్లకు అమ్మినట్లు సమాచారం. కాబట్టి జిగర్ తండ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 38 కోట్ల షేర్, రూ. 70 కోట్ల గ్రాస్ వరకు రాబట్టాల్సి ఉంది.
అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న జిగర్ తండ ఫస్ట్ డే అంచనాలు అందుకోలేదు. వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా జస్ట్ కోటి రూపాయల షేర్ వచ్చినట్లు సమాచారం. జిగర్ తండ చిత్రాన్ని వర్ల వైడ్ 2700 థియేటర్స్ లో భారీగా విడుదల చేశారు. తమిళ వెర్షన్ ఓవర్ ఆల్ గా 30% ఆక్యుపెన్సీ నమోదు చేసింది. తెలుగు వెర్షన్ 20% ఆక్యుపెన్సీ రాబట్టింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం జిగర్ తండ తమిళనాడులో రూ. 5 కోట్లకు పైగా రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ జిగర్ తండ ఫస్ట్ డే షేర్ రూ. 9 కోట్లు వరకు ఉంటుందని అంచనా. జిగర్ తండ చిత్రానికి కార్తీ జపాన్ నుండి పోటీ నెలకొంది. అయితే జపాన్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. జిగర్ తండకు బాక్సాఫీస్ వద్ద పోటీ లేదు. కాబట్టి పుంజుకునే అవకాశం లేకపోలేదు. జిగర్ తండ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.