Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా హౌస్ లో ఉన్న వాళ్ళందరి ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చి వెళ్ళాక చివర్లో రతిక తండ్రి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తండ్రిని చూసి భావోద్వేగానికి గురైయింది రతిక. డాడీ అంటూ హత్తుకుని భోరున ఏడ్చింది. ఆ తర్వాత రతిక తండ్రి అందరిని ప్రేమగా పలకరించాడు. పల్లవి ప్రశాంత్ తో మాట్లాడుతూ ‘ మంచిగా ఆడుతున్నావ్ .. ఇలానే ఆడాలి ‘ అని చెప్పాడు రతిక తండ్రి.
తర్వాత ఇతను డాక్టర్ అంటూ గౌతమ్ ని పరిచయం చేసింది రతిక. అందరూ మంచిగా ఉండండి. బాగా ఆడుతున్నారు .. బిగ్ బాస్ తర్వాత మా ఇంటికి రండి ధావత్ ఇస్తాను అని చెప్పారు. ఇక రతిక తో కాసేపు మాట్లాడి .. కంటెస్టెంట్స్ అందరితో సమయం గడిపారు. ఇక టైమ్ అయిపోయిందని బిగ్ బాస్ ప్రకటించారు. ఇక వెళ్తూ వెళ్తూ డిజే టిల్లు పాటకి స్టెప్పులేసి అదరగొట్టేడు రతిక తండ్రి. రతిక కూడా వాళ్ళ నాన్నతో కలిసి డాన్స్ చేసి మురిసిపోయింది.
ఫ్యామిలీ వీక్ నామినేషన్ లో ఉన్నవారికి కాస్తో కూస్తో అడ్వాంటేజ్ అయింది. కుటుంబ సభ్యుల రాకతో ఎమోషన్స్ పండాయి. దీంతో నామినేషన్స్ ఉన్న శివాజీ, భోలే, గౌతమ్ కృష్ణ, యావర్ ల కి ఓటింగ్ పరంగా గ్రాఫ్ బాగా పెరిగింది. యావర్ కి అమ్మ సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. దీనివల్ల యావర్ కి ఓట్లు పడే అవకాశం చాలా ఉంది.
కాగా శుక్రవారంతో ఓటింగ్ ముగిసింది. ఒక్కరోజులో ఓటింగ్ తారుమారైందని సమాచారం. శివాజీ మాత్రం టాప్ లోనే ఉన్నారు. గౌతమ్, భోలే, రతిక, యావర్ ఓటింగ్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయట. నాలుగో స్థానంలో ఉన్న యావర్ రెండో స్థానంలోకి వచ్చాడట. భోలే సైతం ఓటింగ్ మెరుగు పరుచుకుని మూడో స్థానంకి వచ్చాడట. అనూహ్యంగా గౌతమ్ నాలుగో స్థానానికి పడిపోయాడట. రతిక చివరి స్థానంలో ఉండగా ఆమె ఓటింగ్ అలానే ఉందట. కాబట్టి నేడు రతిక ఎలిమినేషన్ ఖాయం అంటున్నారు.