https://oktelugu.com/

Tollywood Crazy Updates: టాలీవుడ్ సోషల్ మీడియా క్రేజీ అప్ డేట్స్ !

Tollywood Crazy Updates: హీరో నవదీప్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. కాగా పెళ్లి చేసుకోవాలని నెటిజన్లు ఇచ్చిన సలహాకు హీరో నవదీప్ కౌంటర్ ఇచ్చాడు. ‘అన్నా నీ గడ్డం తెల్లబడుతోంది. త్వరగా పెళ్లి చేసుకో అని కొంతమంది నాకు సలహాలు ఇస్తున్నారు. గడ్డం తెల్లబడితే చేయాల్సింది ట్రిమ్మింగ్.. పెళ్లి కాదు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా’ అని నవదీప్ ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 24, 2022 8:36 am
    Follow us on

    Tollywood Crazy Updates: హీరో నవదీప్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. కాగా పెళ్లి చేసుకోవాలని నెటిజన్లు ఇచ్చిన సలహాకు హీరో నవదీప్ కౌంటర్ ఇచ్చాడు. ‘అన్నా నీ గడ్డం తెల్లబడుతోంది. త్వరగా పెళ్లి చేసుకో అని కొంతమంది నాకు సలహాలు ఇస్తున్నారు. గడ్డం తెల్లబడితే చేయాల్సింది ట్రిమ్మింగ్.. పెళ్లి కాదు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా’ అని నవదీప్ ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ముఖ్యంగా . దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా అంటూ నవదీప్ చెప్పిన డైలాగ్ బాగా ట్రెండ్ అవుతుంది.

    navdeep

    navdeep

    ఇక మాస్ మహారాజా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘ఖిలాడీ’ మూవీ గురించి చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ నెల 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా.. ఆ రోజు ఉదయం 10.08 గంటలకు ‘ఫుల్ కిక్కు’ అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తామని ప్రకటించింది. అలాగే ఫిబ్రవరి 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని చిత్రయూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. అంటే.. ఫిబ్రవరి 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

    Also Read:  సీనియర్ హీరోకి కరోనా.. టెన్షన్ లో ప్రభాస్ !

     

    khiladi

    khiladi

    ముదురు బబ్లీ బ్యూటీ ప్రియమణి కీలక పాత్రలో అభిమన్యు తెరకెక్కించిన చిత్రం భామాకలాపం. కాగా క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న ఆహాలో ప్రసారం కానుంది. ఇందులో ప్రియమణి గృహిణిగా, పక్కింట్లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపే మహిళగా కనిపించింది. ఇక ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.

    priyamani

    priyamani

    Also Read: భీమ్లా నాయక్ మనసు మారిందా? రిలీజ్ డేట్ చేంజ్ పై నిర్మాతల సమాలోచనలు

    Tags