Jayammu Nischayammu Raa King Nagarjuna: ఒకప్పుడు హీరో గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకొని, మార్కెట్ పోయిన తర్వాత విలన్ క్యారెక్టర్స్ మరియు ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ కెరీర్ లో ఫుల్ బిజీ గా మారిన జగపతి బాబు(Jagapathi Babu), ఈమధ్య కాలం లో పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ, చిన్న చిన్న పాత్రలు మాత్రమే దక్కుతున్నాయి. ఒకప్పటి లాగా మెయిన్ విలన్ క్యారెక్టర్స్ ఆయనకు ఈమధ్య కాలం లో దొరకడం లేదు. ఆడియన్స్ తో ఆయనకు నెమ్మదిగా కనెక్షన్ పోతున్న సమయంలో జీ తెలుగు ఛానల్ లో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే ప్రోగ్రాం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఒకవిధంగా చెప్పాలంటే జగపతి బాబు కెరీర్ లో ఇది మరో కొత్త చాప్టర్ అనే అనుకోవాలి. ఈ ప్రోగ్రాం లోని మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు.
Also Read: సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ..విషయం ఏమిటంటే!
మొదటి ఎపిసోడ్ కి అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) అతిథిగా విచ్చేశాడు. ఆయనతో జగపతి బాబు చేసిన ‘RAW’ ఇంటర్వ్యూ బాగా హైలైట్ అయ్యేట్టు ఉంది. ఈ ఇంటర్వ్యూ ప్రోమో విశేషాలు ఏంటో చూద్దాం. ముందుగా జగపతి బాబు నాగార్జున కి షో ఫార్మటు చెప్తూ ‘ఇది సిగ్గులేకుండా మాట్లాడుకునే షో’ అని అంటాడు. అప్పుడు నాగార్జున ‘కం ఆన్..మొదలుపెట్టు’ అని అంటాడు. ఎంతో మంది హీరోయిన్స్ తో పని చేశావు, నీ దృష్టిలో బెస్ట్ కో యాక్ట్రెస్ ఎవరు?, రమ్యకృష్ణ లేదా టబు? అని అడుగుతాడు జగపతి బాబు. దానికి నాగార్జున సమాధానం చెప్తూ ‘కొన్నిటికి సమాధానం చెప్పకూడదు..నేను చెప్పను’ అని అంటాడు. అప్పుడు నాగార్జున జగపతి బాబు ని ప్రశ్న అడుగుతూ ‘ఇప్పుడు నీ బెస్ట్ కో యాక్ట్రెస్ ఎవరు?, రమ్యకృష్ణ, లేదా సౌందర్య నా?’ అని అడుగుతాడు. అప్పుడు జగపతి బాబు ‘ఇది నా ఇంటర్వ్యూ కాదు..నేను సమాధానం చెప్పను’ అని అంటాడు.
అయితే నాగార్జున కి టబు కి మధ్య చాలా ఏళ్ళ క్రితం ప్రేమాయణం నడిచింది అంటూ రూమర్స్ గట్టిగా వినిపించిన సంగతి తెలిసిందే. ఇది నిజం కాదు, రూమర్ మాత్రమే అని నాగార్జున ఎప్పుడు చెప్పలేదు, అదే విధంగా టబు కూడా ఎప్పుడూ రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే ఆమె గురించి ఈ ఇంటర్వ్యూ లో ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం నాగార్జున సమాధానం దాటి వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతే ప్రచారమైనవి రూమర్స్ కాదు,నిజమే అనే అర్థం వచ్చేలా ఈ ప్రోమో ఉంది. అదే విధంగా జగపతి బాబు కూడా అప్పట్లో సౌందర్య తో ప్రేమాయణం నడిపాడు అని అంటుంటారు. నాగార్జున ఆమె గురించి అడిగినప్పుడు జగపతి బాబు కూడా సమాధానం చెప్పలేదు. అయితే వీళ్లిద్దరి ప్రశ్నల్లో కామన్ గా రమ్యకృష్ణ ఉండిపోయింది. అంటే అప్పట్లో రమ్యకృష్ణ తో కూడా వీళ్లిద్దరు మంచి స్నేహం నడిపారు అన్నమాట అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఈవెంట్ లో నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి రమ్య కృష్ణ కోసం కొట్లాడుకుంటారు. అదే సీన్ ఇక్కడ కూడా రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. దీని అర్థం ఈయన కూడా నిజమే అని ఒప్పుకున్నట్టే అన్నమాట. ఆద్యంతం ఆసక్తికరంగా అనిపించినా ఈ ప్రోమో కి సంబంధించిన ఎపిసోడ్ ఈ నెల 15 న టెలికాస్ట్ కానుంది.