Anchor Ravi Bigg Boss: అప్పుడప్పుడే ఇండస్ట్రీ లో ఎదుగుతున్న వారు, కోట్లాది మంది తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గర అవ్వడం కోసం బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) అనే రియాలిటీ షో ని వేదిక గా ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఆ షోలో పాల్గొన్న ప్రతీ సెలబ్రిటీ టార్గెట్ ని చేరుకోలేకపోయారు. ఒక విధంగా చెప్పాలంటే బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు కెరీర్ చాలా బాగుండేది, వెళ్లిన తర్వాత కెరీర్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది మాత్రం బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటూ తమ కెరీర్ ని గొప్పగా సెట్ చేసుకున్నారు. అయితే బిగ్ బాస్ షో తర్వాత అనుకున్న స్థాయి టార్గెట్ ని చేరుకోలేకపోయిన సెలబ్రిటీలలో ఒకరు యాంకర్ రవి(Anchor Ravi). బిగ్ బాస్ షో కి ముందు ఈయన చేతినిండా అవకాశాలు ఉండేవి. అనేక చానెల్స్ లో యాంకర్ గా పని చేస్తూ ఉండేవాడు.
Also Read: సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ..విషయం ఏమిటంటే!
కానీ బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన తర్వాత ఆయన కోరుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. అలా అని ఖాళీగా కూడా లేడు. యాంకర్ ప్రదీప్,సుడిగాలి సుధీర్ రేంజ్ బిజీ గా లేడంతే. ప్రస్తుతం ఆయన ఈటీవీ ఛానల్ లో ‘తగ్గేదేలే’ అనే ప్రోగ్రాం చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ కి సంబంధించిన అనుభవాలను పంచుకున్నాడు. బిగ్ బాస్ కి ఎందుకు వెళ్లారు?, ఫేమ్ కోసమా, డబ్బు కోసమా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు, రవి సమాధానం చెప్తూ ‘డబ్బు కోసమే..వాస్తవానికి నన్ను ఎప్పటి నుండో బిగ్ బాస్ కి అడుగుతున్నారు. కానీ నాకు ఆసక్తి లేక ఒప్పుకోలేదు. కానీ స్టార్ మా ఛానల్ లో నాకు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు అనేకసార్లు నన్ను అడిగేవారు’.
‘ఎన్ని సార్లు అని నో చెప్తాము చెప్పు. సీజన్ 4 సమయంలో అడిగేసరికి, నో చెప్పడం ఇష్టం లేక, భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే వాళ్ళే వద్దు అంటారు అనుకొని, ఒక భారీ ప్రైజ్ ని వాళ్ళ ముందు ఉంచి, ఇంత రెమ్యూనరేషన్ ఇస్తాను అంటేనే వస్తాను అని చెప్పాను. రిజెక్ట్ చేస్తారేమో అనుకున్నా, కానీ వాళ్ళు అందుకు ఒప్పుకున్నారు. దీంతో నేను తప్పక ఆ షోలో పాల్గొనాల్సి వచ్చింది. ఆ షో కి వెళ్లే ముందే నా భార్య కి చెప్పాను. ఇంత డబ్బులు పెట్టి నన్ను వాళ్ళు తీసుకుంటున్నారు. నా నుండి పాజిటివ్ కంటెంట్ అయినా తీసుకోవచ్చు, నెగటివ్ కంటెంట్ ని అయినా తీసుకోవచ్చు, కాబట్టి దేనికైనా సిద్దమై ఉండు అని చెప్పాను, షో లో కూడా వాళ్లకు కావాల్సిన కంటెంట్ నే తీసుకున్నారు, బాగా నెగటివ్ ఇమేజ్ వచ్చింది. నా కెరీర్ మీద ప్రభావం పడింది. కానీ నాకు ఇస్తాను అని చెప్పిన రెమ్యూనరేషన్ ఇచ్చారు. దాదాపుగా కోటి రూపాయిల వరకు వచ్చింది. దాంతో మంచి ఇల్లు కొనుక్కున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు రవి. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.