Yamadonga Re-Release : టాలీవుడ్ లో రీ రిలీజ్ చిత్రాల ట్రెండ్ ఒకానొక దశలో కొత్త సినిమాలను సైతం డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం కాస్త క్రేజ్ తగ్గిందేమో అని ఈ ఆదివారం విడుదల కాబోతున్న ఎన్టీఆర్(Junior NTR) ‘యమదొంగ'(Yamadonga Movie) చిత్రాన్ని చూస్తుంటే అనిపిస్తుంది. మే20 న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 18న యమదొంగ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ పుట్టిన రోజు మంగళవారం రావడంతో ఆదివారం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ సినిమాకు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఆల్ టైం రికార్డు గ్రాస్ సంగతి పక్కన పెడితే, కనీసం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను అయినా రాబడుతుందా లేదా అని ఎన్టీఆర్ అభిమానులు భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని గత ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ రీ రిలీజ్ చేస్తే మొదటి రోజు 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Also Read : ‘సింగిల్’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఏకంగా ‘హిట్ 3’ నే దాటేసిందిగా!
ప్రస్తుతానికి ఇదే టాలీవుడ్ ఆల్ టైం రికార్డు. ఈ రికార్డు ని యమదొంగ చిత్రం కచ్చితంగా బద్దలు కొడుతుందని ముందుగా అందరూ అనుకున్నారు. కానీ బుక్ మై షో యాప్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కనీస స్థాయిలో కూడా జరగడం లేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రీ రిలీజ్ చిత్రాలకు క్రేజ్ తగ్గిపోయిందేమో అని సోషల్ మీడియా లో అనుకుంటూ ఉన్నారు. కానీ రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కి 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి కదా అని విశ్లేషకులు అంటున్న మాట. ‘యమదొంగ’ చిత్రానికి న్యూట్రల్ ఆడియన్స్ క్రేజ్ తక్కువ ఉంటుంది. కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తేనే వసూళ్లు వస్తాయి. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకో ఈసారి ఈ చిత్రంపై ఆసీనిన స్థాయిలో ఆసక్తిని చూపడం లేదు.
ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ సినిమాకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ 50 లక్షల రూపాయలకు లోపే ఉందట. ఈరోజు, రేపు బుకింగ్స్ ట్రెండ్ మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ఫుల్ రన్ లో రెండు కోట్ల రూపాయిలు మించి గ్రాస్ వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు. రేపు, ఎల్లుండి ఏమైనా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటే మూడు కోట్ల రూపాయిల మార్కుని కూడా టచ్ చేయొచ్చు. ఎన్టీఆర్ గత రీ రిలీజ్ సింహాద్రి కి నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి అంత వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు.
Also Read : రెట్రో’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..తెలుగు రాష్ట్రాల్లో ఎపిక్ డిజాస్టర్!