Papaya Benefits : మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ప్రస్తుత కాలంలో రకరకాల వ్యాయామాలు చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. దీంతో ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు కూర్చొని చేసే పనులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో రకరకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. అయితే కొంతమంది ఉదయం వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. కానీ మరికొందరికి సమయం తీరిక లేక ఉదయాన్నే పనుల్లో మునిగిపోతున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. వీటిలో బొప్పాయి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బొప్పాయి తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఉదయమే దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ALso Read : అప్పులు తీర్చే సులువైన మార్గాలు ఇవే..
ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఫ్రూట్స్ లో బొప్పాయి ఒకటి. బొప్పాయి లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఇవి కాపాడుతాయి. అయితే ఉదయమే బొప్పాయి తినడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉండగలుగుతారు. చాలామంది నేటి కాలంలో బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి అనేక రకాల వ్యాయామాలు చేస్తున్నారు. కానీ ఉదయమే బొప్పాయి తినడం వల్ల కడుపు నిండినట్లుగా ఉండి ఇతర ఆహారం తీసుకోవాలని అనిపించదు. అంతేకాకుండా ఉదయమే దీనిని తినడం వల్ల రోజంతా శక్తిని ఇస్తుంది. ఇలా ప్రతిరోజు కొన్ని రోజులపాటు బొప్పాయి తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉండడంతో అదనపు కేలరీలు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉండదు. దీంతో బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
బొప్పాయిలో లైకోపీన్, ప్లవనాయిడ్లూ అధికంగా ఉంటాయి. ఇవి కాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. వివిధ రకాలుగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉన్నవారు బొప్పాయి తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు బొప్పాయి చేయడం వల్ల సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బొప్పాయి తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. దీంతో కడుపులో ఎలాంటి మలినాలు ఉన్నా.. వెంటనే వాటిని తొలగిస్తుంది. ఫలితంగా కడుపు క్లీన్ అవుతుంది. జీర్ణ సమస్యతో బాధపడేవారు ప్రస్తుత కాలంలో అధికంగా ఉన్నారు. అయితే బొప్పాయిలో pafine అనే ఎంజైమ్ఉంటుంది. దీంతో దీర్ఘ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది.ఎసిడిటీ సమస్య ఉన్నవారు సైతం బొప్పాయిని రెగ్యులర్గా తినడం వల్ల పరిష్కారం అవుతుంది.
ప్రతిరోజు ఉదయం మిగతా ఫ్రూట్స్ కంటే బొప్పాయి తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనిని కొనుగోలు చేసే సమయంలో నాణ్యమైనవి తీసుకోవాలి. మార్కెట్లో కల్తీ బొప్పాయిలు చాలా వరకు వస్తున్నాయి. వీటిలో న్యాచురల్ గా ఉండే వాటిని కొనుగోలు చేయడం మంచిది. లేకుంటే కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంది.