Jaya Bachchan : అమితాబ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. అమితాబ్ సతీమణి జయా బచ్చన్ కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని ఆమె తెలియజేశారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. జయా కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, ఆమె కరోనా విషయంలో మొదటి నుంచి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా ఆమెకు కరోనా సోకడం బాధాకరమైన విషయం.
కాగా జయా బచ్చన్ కు కరోనా సోకి హోం ఐసోలేషన్‌లోకి వెళ్లడంతో.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కరోనా ఫస్ట్ వేవ్‌లో జయా బచ్చన్ మినహా ఇతర కుటుంబసభ్యులంతా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కానీ మూడో వేవ్ లో మాత్రం జయా బచ్చన్ కరోనా నుంచి తప్పించుకోలేకపోయారు. ఏది ఏమైనా కరోనా సినిమా వాళ్లకు భారీ సినిమానే చూపిస్తోంది.
సహజంగా సినిమా ప్రముఖులు చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే, వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా కరోనా వాళ్ళ పై అటాక్ చేస్తూనే ఉంది. ఈ రోజు జయా బచ్చన్ కి కరోనా పాజిటివ్ అని తేలడం షాకింగ్ విషయమే. అన్నట్టు జయా బచ్చన్ కారణంగా సెట్ లో కూడా కొందరు టెక్నీషియన్స్ కి కరోనా సోకినట్టు సమాచారం. ప్రస్తుతం వాళ్ళు కూడా క్వారంటైన్‌లో ఉన్నారట.
ఇక జయా బచ్చన్ కి స్వల్ప లక్షణాలున్నాయని సమాచారం. ఓ పది రోజుల పాటు జయా బచ్చన్ చిత్రీకరణకు దూరం కానున్నారు. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలని జయా విజ్ఞప్తిచేస్తున్నారు. ఇంతకీ జయాకు కరోనా పాజిటివ్ అని తేలింది. మరి అమితాబ్ పరిస్థితి ఏమిటి ?