Jaya Bachchan Controversy: బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ హుందాగా ఉంటారు. అభిమానులను ఏమాత్రం నొప్పించే ప్రయత్నం చేయరు. ఇంత వయసులో కూడా అభిమానులు అడిగితే ఆయన సెల్ఫీలు ఇస్తారు. ఆటోగ్రాఫ్ లు కూడా ఇస్తారు. అవకాశం దొరికితే సరదాగా ముచ్చటిస్తారు. ఇతర విషయాలను కూడా పంచుకుంటారు. కానీ ఆయన సతీమణి జయా బచ్చన్ అలా కాదు. సమాజ్ వాది పార్టీ నుంచి ఆమె ఎంపీగా కొనసాగుతున్నారు.. పైగా ఫైర్ బ్రాండ్.. తన చేష్టలతో, తన మాటలతో ఆమె నిత్యం వార్తలోనే ఉంటారు..
Also Read: కూలీ దెబ్బ కి హ్యాంగ్ అయిన యాప్.. రజినీకాంత్ అంటే అలా ఉంటది మరి…
జయా బచ్చన్ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒక కార్యక్రమానికి జయ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమె అనుమతి లేకుండా ఒక అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇది ఆమెకు కోపాన్ని కలిగించింది. వెంటనే అక్కడికక్కడే ఆ అభిమానికి చివాట్లు పెట్టింది.. దీనిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలోకి ఎక్కించారు. అంతే నెటిజన్లు జయా బచ్చన్ మీద ఫైర్ అవుతున్నారు. ఆ అభిమానిని ఫోటో తీయొద్దని చెప్తే సరిపోయేది కదా.. ఇంత పొగరుగా ప్రవర్తించడం ఎందుకని.. నెటిజన్లు ఆమె మీద ఫైర్ అవుతున్నారు.
జయ ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలో అనేక సందర్భాలలో ఇలానే వ్యవహరించారు. అభిమానులపై మొహమాటం లేకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు.. అప్పట్లో ఆమె మాట్లాడిన మాటలు సంచలనం కలిగించాయి. ఆమె ప్రవర్తన పట్ల అభిమానులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ.. ఇప్పటికీ ఆమె అదే ధోరణి కొనసాగిస్తున్నారు.. జయ బయట మాత్రమే కాదు.. పార్లమెంట్ లో కూడా ఇదే తీరుగా ప్రవర్తిస్తుంటారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.. అసలు ఆమె ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని.. తన అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకోవడం సరికాదని.. ఆ అభిమానితో చెబితే సరిపోయేదని నెటిజన్లు అంటున్నారు.
మరోవైపు జయ అభిమానులు ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఒక సెలబ్రిటీ అయిన జయతో సెల్ఫీ తీసుకోవాలంటే ఆమె అనుమతి తీసుకుంటే సరిపోయేదని.. అలాకాకుండా నేరుగా సెల్ఫీ తీసుకుంటే ఏ సెలబ్రిటీ కైనా కోపం వస్తుందని.. ఆమె అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫ్రాడ్స్ చేసేవారు పెరిగిపోయారని.. అలాంటివారు సెలబ్రిటీలతో సెల్ఫీలు తీసుకోవడం.. దందాలు చేయడం పరిపాటిగా మారిందని.. అందువల్లే జయ ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటే వారించి ఉంటారని ఆమె గుర్తు చేస్తున్నారు.
#WATCH | Delhi: Samajwadi Party MP Jaya Bachchan scolded a man and pushed him away, while he was trying to take a selfie with her. pic.twitter.com/UxIxwrXSM0
— ANI (@ANI) August 12, 2025