Kadapa DSP Warning: కడప జిల్లాలో( Kadapa district ) రెండు జడ్పిటిసి స్థానాలకు ఉప ఎన్నికలు ముగిసాయి. నిన్ననే పోలింగ్ జరిగింది. అయితే రోజంతా హై డ్రామా నిలిచింది. ఈ పోలింగ్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఖునీ అయిందని ఆరోపిస్తుండగా.. అధికార టిడిపి కూటమి ఇన్ని రోజులకు ప్రజాస్వామ్యం గెలిచింది అంటూ వ్యాఖ్యానిస్తోంది. అయితే నిన్న రోజంతా టిడిపి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ అన్నట్టు పరిస్థితి సాగింది. ఓటర్లను అడ్డుకుంటున్నారని పరస్పరం ఆరోపించుకున్నారు. పులివెందులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్న అవినాష్ రెడ్డి ని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దూకుడుగా వ్యవహరించడంతో డీఎస్పీ మురళి నాయక్ గట్టిగానే హెచ్చరించారు. తీవ్ర పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: తెలంగాణ జిల్లాల్లో స్కూళ్లకు ఐదు రోజుల సెలవులు.. ఏపీలో సెలవులపై అప్డేట్ ఇది
* అవినాష్ రెడ్డి అరెస్ట్..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress party ) పార్టీకి పులివెందులలో పెద్దదిక్కుగా ఉన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుండడంతో పోలీసులు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 1500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కడప తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన నాటకీయంగా తప్పించుకుని తిరిగి పులివెందుల వచ్చినట్లు సమాచారం రావడంతో డిఐజి కోయ ప్రవీణ్ తో పాటు డీఎస్పీ మురళి నాయక్ అవినాష్ రెడ్డి ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. గుంపులు గుంపులుగా గుమిగూడి ఉండడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. దీంతో పోలీసులు అక్కడ వైసీపీ శ్రేణులను పంపించే ప్రయత్నం చేశారు.
* వైసీపీ శ్రేణులకు హెచ్చరిక..
ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటారని అనుమానించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యాలయం నుంచి కదల్లేదు. పైగా గుంపులు గుంపులుగా ఉంటూ నినాదాలు చేశారు. దీంతో డిఎస్పి మురళి నాయక్( DSP Murali Nayak ) ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి కార్యకర్తలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీరు వైసీపీ కార్యకర్తలు అయితే… తనది కాకి యూనిఫామ్ అని.. ఎక్స్ట్రాలు చేస్తే కాల్చిపడేస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు వైసీపీ అధికారంలోకి వస్తే మీ పోలీసు ఉద్యోగాలు ఉండవంటూ ఓ నేత హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే బిఎస్పి మురళి నాయక్ ఈ మాస్ వార్నింగ్ ఇవ్వడం విశేషం.
పులివెందుల: కాల్చి పడేస్తా నా కొడకా.. అంటూ బూతులతో రెచ్చిపోయిన పోలీసు అధికారి pic.twitter.com/fN55n79rpw
— greatandhra (@greatandhranews) August 12, 2025