Jawan Collections: జవాన్ ఖాతాలో మరో రికార్డు… బాక్సాఫీస్ పై షారుఖ్ దండయాత్ర!

పఠాన్ సినిమా కేవలం పది రోజుల్లో దాదాపు 729 కోట్లు వసూళ్లు చేస్తే ఇప్పుడు జవాన్ సినిమా దానిని తిరగరాస్తూ పది రోజుల్లో దాదాపు 797 కోట్లు సాధించింది. దీనిని ధృవీకరిస్తూ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ట్వీట్ చేసింది.

Written By: Shiva, Updated On : September 18, 2023 10:03 am

Jawan Collections

Follow us on

Jawan Collections: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వసూళ్ల సునామి సృష్టిస్తున్నాడు. తాను బాక్సాఫీస్ బాద్షా అని మరోసారి నిరూపించాడు. తాజాగా ఆయన నటించిన జవాన్ సినిమా అనేక రికార్డ్స్ బద్దలు కొడుతోంది. షారుఖ్ గత సినిమా పఠాన్ ను మించి ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమా పది రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది.

పఠాన్ సినిమా కేవలం పది రోజుల్లో దాదాపు 729 కోట్లు వసూళ్లు చేస్తే ఇప్పుడు జవాన్ సినిమా దానిని తిరగరాస్తూ పది రోజుల్లో దాదాపు 797 కోట్లు సాధించింది. దీనిని ధృవీకరిస్తూ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ట్వీట్ చేసింది. ఇక నెట్ విషయానికి వస్తే పది రోజుల్లో దాదాపు 440 కోట్ల దాకా వసూళ్లు చేసింది. 305 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా భారీ లాభాల బాట పట్టింది.

ఇక 11 వ రోజు అయిన ఆదివారం భారీ కలెక్షన్స్ చేసింది జవాన్ సినిమా. దాదాపు 36 కోట్ల కు పైగా నెట్ వసూళ్లు చేసింది. దీనితో 11 రోజుల ఫైనల్ నెట్ వసూళ్లు 475 కోట్ల మార్క్ క్రాస్ చేసింది ఈ సినిమా. రాబోయే రెండు రోజుల్లో ఈజీగా 500 కోట్ల నెట్ క్రాస్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. ఇక గ్రాస్ విషయానికి వస్తే ఇప్పటికే 850 కోట్లకు పైగా వసూళ్లు చేసిన జవాన్ ఈ వారం ముగిసేసరికి 1100 కోట్ల మార్క్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది.

సౌత్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా యావత్తు ఇండియా ని షేక్ చేస్తుంది. షారుఖ్ ఖాన్ ను ఇప్పటి వరకు చూడని భిన్నమైన గెటప్ లో చూపిస్తూ, పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ గా మలిచాడు ఈ సినిమాను. అక్కడక్కడ సినిమా లిబర్టీ తీసుకున్న కానీ శృతి మించకుండా, ఎక్కడ అతి అనిపించకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లే తో సినిమాను రక్తి కట్టించాడు అట్లీ. ఈ దర్శకుడితో పనిచేయడానికి ఇప్పుడు ఇండియన్ సూపర్ స్టార్స్ అందరూ ఎదురుచూస్తున్నారు.