Jawan Collections: జవాన్ నాలుగో రోజు వసూళ్లు .. షారుఖ్ శివతాండవం!

ఇక జవాన్ సినిమా నాలుగో రోజు వసూళ్లు చూస్తే షాక్ అవ్వడం ఖాయం. మొదటి రోజు వసూళ్లు కంటే ఎక్కువ సాధించింది. నాలుగో రోజే ఇండియా వైడ్ గా దాదాపుగా 81 కోట్ల నెట్ వసూళ్లు చేసింది ఈ సినిమా.

Written By: Shiva, Updated On : September 11, 2023 12:42 pm

Jawan Collections

Follow us on

Jawan Collections: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ దగ్గర శివతాండవం చేస్తున్నాడు. ఇండియన్ హిస్టరీ లో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తూ తన సత్తా ఏమిటో చూపిస్తూ దూసుకెళ్తున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది జవాన్ సినిమా. ఈ ఏడాది తో ఇంత స్పీడ్ గా 500 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా ఇదే. పఠాన్ సినిమా కు ఐదు రోజులు గదర్ సినిమాకు దాదాపు 20 రోజులు పట్టింది.

ఇక జవాన్ సినిమా నాలుగో రోజు వసూళ్లు చూస్తే షాక్ అవ్వడం ఖాయం. మొదటి రోజు వసూళ్లు కంటే ఎక్కువ సాధించింది. నాలుగో రోజే ఇండియా వైడ్ గా దాదాపుగా 81 కోట్ల నెట్ వసూళ్లు చేసింది ఈ సినిమా. తొలిరోజు 75 కోట్లు సాధించి హౌరా అనిపించిన జవాన్ నాలుగో రోజు అంతకు మించి అన్నట్లు సత్తా చాటింది. ఇక మొదటి నాలుగు రోజులు వసూళ్లు గమనిస్తే ఇండియా వైడ్ గా 288 కోట్లు సాధించింది. వరల్డ్ వైడ్ గా 300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయినట్లు తెలుస్తుంది.

మరోపక్క ఓవర్శిస్ లో షారుఖ్ ఖాన్ దుమ్ములేపుతున్నాడు. నాలుగో రోజు కూడా 6 మిలియన్స్ డాలర్స్ వసూళ్లు చేసింది ఈ సినిమా. ఓవరాల్ గా ఓవర్శిస్ లో 20 మిలియన్స్ సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇండియన్ కరెన్సీ లో చూస్తే దాదాపు 170 కోట్లు అక్కడ వసూళ్లు చేసింది ఈ సినిమా. ఈ సినిమా నెట్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా 350 కోట్లు పైగా సాధించింది. ఇప్పటికే బ్రేక్ ఈవెంట్ కావటంతో నిర్మాతలకు, సినిమా కొన్న బయ్యర్లు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

సౌత్ దర్శకుడు పరాజయం అంటే ఏమిటో తెలియని అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా పూర్తిగా సౌత్ ఫ్లేవర్ లోనే ఉంటుంది.. ఈ సినిమా విషయంలో దర్శకుడికి పూర్తిగా పగ్గాలు ఇచ్చాడు షారుఖ్. అందుకే ఈ స్థాయి విజయం సాధించింది. ఒక్క షారుఖ్ మినహా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో అందరు సౌత్ నటీనటులే నటించి మెప్పించారు. ఇక జవాన్ దూకుడు ఇలాగే కొనసాగితే ఈ వారం అయ్యేలోపు 1000 కోట్ల మార్క్ అందుకునే అవకాశం ఉంది.